మహేష్ కు భయపడిన నాని..!

హీరో నాని గత రెండు చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’తో నిరాశపరిచాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నానితో పాటు నాని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. [more]

Update: 2019-02-13 11:06 GMT

హీరో నాని గత రెండు చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’తో నిరాశపరిచాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నానితో పాటు నాని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘మళ్ళీ రావా’తో సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. గత నెలలో రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏకంగా రూ.50 కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్.

ముందే రావాల‌ని…

నిజానికి ఈ మూవీ ఏప్రిల్ 19న విడుదల అవ్వాలి. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆ తరువాత వారం మహేష్ బాబు ‘మహర్షి’ వస్తుంది. రెండు సినిమాల‌కు వారం రోజులు కూడా గ్యాప్ లేకపోవడంతో, ఒకవేళ మహేష్ సినిమాకు పాజిటివ్ టాక్ ‘జెర్సీ’పై ఎఫెక్ట్ పడుతుందని భావించి ఇంకా కొంచం ముందే రావాలని భావిస్తున్నారు మేకర్స్. కుదిరితే 12న లేదంటే ఇంకా ముందుగా 5నే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే అదే రోజున అంటే 5న సితార వాళ్లదే ‘మజిలీ’ రిలీజ్ కాబోతోంది. ఇక సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ అదే నెల 12న రాబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక‌ సినిమాతో నాని పోటీ పడనున్నాడు.

Tags:    

Similar News