రాజుగారు.. మీరే ఇలా అంటే ఎలా..?

దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా విజయాలను అందుకుంటూనే నిర్మాతగా మారి అనేక సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాల జోలికిపోకుండా [more]

Update: 2019-02-01 08:45 GMT

దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా విజయాలను అందుకుంటూనే నిర్మాతగా మారి అనేక సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాల జోలికిపోకుండా మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని దిల్ రాజు అందుకున్నాడు. అయితే నిర్మాతగా బాగానే ఉన్నా.. ఈ మధ్యన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా బాగా దెబ్బతింటున్నాడు. చిన్నాపెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు పెద్ద సినిమాల దెబ్బకి విలవిలలాడుతున్నాడు. నిర్మాతగా సంపాదిస్తున్న సొమ్ముని డిస్ట్రిబ్యూటర్ గా పోగొట్టుకుంటున్నాడు.

తలలు పట్టుకుంటున్న మిగతా డిస్ట్రుబ్యూటర్లు

డిస్ట్రిబ్యూటర్ గా వరసగా ఫెయిల్యూర్స్ బాధించడంతో.. దిల్ రాజు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కి బై బై చెప్పబోతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్ గా చాలా లాస్ రావడంతోనే దిల్ రాజు ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాతగా ఎఫ్ 2తో విజయం అందుకున్న దిల్ రాజు ఇలాంటి డెసిషన్ కి రావడం కాస్తా షాకింగే. ఎందుకంటే దిల్ రాజు ఏ సినిమా అయినా కొని విడుదల చేస్తున్నాడు అంటే.. ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండేవి. ఇక దిల్ రాజు కొన్నాకే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాని కొనడానికి ముందుకొస్తారు. అయితే దిల్ రాజు లాంటి బడా డిస్ట్రిబ్యూటరే ఇలా అంటే ఎలా అంటూ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకుంటూ… రాజుగారు మీరే ఇలా అంటే ఎలా అంటున్నారట.

Tags:    

Similar News