మాణికర్ణిక చూసింది అందుకేనా..?

కంగనా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక సినిమా వివాదాలతోనే కాదు.. కలెక్షన్స్ పరంగానూ ఎప్పటికప్పుడు న్యూస్ అఫ్ ధి [more]

Update: 2019-01-29 08:31 GMT

కంగనా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక సినిమా వివాదాలతోనే కాదు.. కలెక్షన్స్ పరంగానూ ఎప్పటికప్పుడు న్యూస్ అఫ్ ధి డే అవుతుంది. సినిమాలో ఓ అన్నంత విషయం లేకపోయినా.. కంగనా ఝాన్సీ లక్ష్మి భాయ్ గా చేసిన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మరొపక్కన టాలీవుడ్ దర్శకుడు క్రిష్ మణికర్ణిక సినిమా డైరెక్షన్ విషయంలో రాద్ధాంతం చెయ్యడం కూడా మణికర్ణిక కలెక్షన్స్ పెరగడానికి కారణమవుతుంది. అలాగే క్రిష్ ఏదో విధంగా కంగనాను రెచ్చగొడుతున్నాడు. అయితే మణికర్ణిక సినిమా హిట్ కాకపోయినా.. ప్రస్తుతం ఆ సినిమా మీదున్న వివాదాలు, కంగనా రనౌత్ వలన సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.

సైరా సినిమా తీస్తున్నందున…

తాజాగా మణికర్ణిక సినిమాని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి కూడా చరిత్రాత్మక కథ సైరా నరసింహ రెడ్డి సినిమాని చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరు ఉయ్యాలవాడ జీవిత చరిత్రను సైరా నరసింహారెడ్డిగా తెరకెక్కిస్తున్నాడు. అయితే మణికర్ణిక లాంటి కథ, కథనంతోనే సైరా సినిమా కూడా రెడీ అవటంతో చిరు మణికర్ణిక సినిమాని చూసి తన సినిమాని బేరీజు వేసుకోవడానికి అని తెలుస్తుంది.అయితే మణికర్ణికలో రెండు మూడు సీక్వెన్స్ లు తప్ప మిగతాదంతా ఒకే రకమైన కథనమని అభిప్రాయపడ్డారట. అందుకే మణికర్ణిక విజయ సాధించినట్టే తమ చిత్రం సైతం ఘన విజయం సాధిస్తుందనే ధైర్యం సైరా టీమ్ కు వచ్చిందట.

సైరాలో కొన్ని మార్పులు చేయాలని…

ఇక సైరా రచయితలు మాత్రం మణికర్ణిక సినిమా చూసాక… సైరాలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తే బాగుంటుందని చిరుకు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి చిరు దానికి ఒప్పుకుంటాడా లేదో అనేది క్లారిటీ లేదు కానీ.. మణికర్ణిక సినిమా మాత్రం చిరుకి బాగా నచ్చిందని టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News