బాబు సీన్స్ కి కత్తెర వేసారా..?

టాక్ ఏమో హిట్ అని వచ్చింది. కలెక్షన్స్ ఏమో మరి దారుణంగా వచ్చాయి. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ నుండి కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ [more]

Update: 2019-02-06 06:42 GMT

టాక్ ఏమో హిట్ అని వచ్చింది. కలెక్షన్స్ ఏమో మరి దారుణంగా వచ్చాయి. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ నుండి కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ నటుడిగా ఎలా ఎదిగారు అనేది చూపించకుండా ఎన్టీఆర్ లాంటి హీరో దొరకడం టాలీవుడ్ చేసుకున్న పుణ్యం అన్నట్టు చూపించారు. దీంతో కొంతమంది ఈ సినిమాను తిరస్కరించారు. అందుకే రెండో భాగం మహానాయకుడు విషయంలో అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తలు పడుతుంది ఎన్టీఆర్ టీం.

చంద్రబాబు సీన్స్ తగ్గించడమే…

ఇందులో ఎన్టీఆర్‌ని అనితరసాధ్యుడిలా చూపించడం లేదట. ఇక చంద్రబాబు నాయుడు పాత్రని ఎలివేట్‌ చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. స్పందన ప్రకారం ఎలివేషన్ సీన్స్ తగ్గించేయనున్నారు. అయినప్పటికీ ఒకటో రెండో చంద్రబాబును ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయట. కానీ ముందు అనుకున్న దానితో పోలిస్తే మాత్రం అది చాలా తగ్గిపోయిందని సమాచారం. ఇది అంతా పక్కన పెడితే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వట్లేదు.

Tags:    

Similar News