‘వివిరా’ ఫ్లాప్ అయినా బోయపాటి మారలేదు..!

రామ్ చరణ్ `విన‌య విధేయ రామ‌` విషయంలో డైరెక్టర్ బోయపాటి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని, అందుకే ప్రొడ్యూసర్ కి, బోయపాటికి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు [more]

Update: 2019-02-12 07:25 GMT

రామ్ చరణ్ 'విన‌య విధేయ రామ‌' విషయంలో డైరెక్టర్ బోయపాటి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడని, అందుకే ప్రొడ్యూసర్ కి, బోయపాటికి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇది నిజమే ఎందుకంటే సినిమా చూస్తే మనకే అర్ధం అవుతుంది. సరే ఇంత ఖర్చు పెడితే సినిమా డిజాస్టర్ అయింది. రిజల్ట్ చూసైనా ఏమన్నా మారతాడా అంటే అదీ లేదు. ఇప్పుడు అతను తీయబోయే బాలకృష్ణ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని అడిగాడ‌ట‌. వీరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం బోయపాటి 70 కోట్లు అడిగాడట. ఒకరకంగా బాలయ్యపై ఇది రిస్కు వ్య‌వ‌హార‌మే.

బాల‌య్య‌తో రిస్క్ చేస్తున్నాడా..?

ఇప్పటివరకు బాలయ్య సినిమాలేవీ 70 కోట్లు చేయలేదు. రీసెంట్ గా వచ్చిన కథానాయకుడు కూడా అంత చేయలేదు. కేవలం 20 కోట్లు వద్ద ఆగిపోయింది. అయితే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ వేరు. వీరి కాంబినేషన్ వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్లే. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కావడం లేదు బోయపాటి. అయితే ఈ సినిమాకి బాలయ్యనే నిర్మాత. అయితే బాలయ్య ఇంతవరకు బడ్జెట్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా తగ్గించే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News