హిట్ దర్శకుడికి ఘోర అవమానం..!

కొరియోగ్రాఫేర్ గా హిట్ అయ్యాక దర్శకుడిగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాని ఫేమ్.. కేవలం కాంచన సీక్వెల్ అంటూ హర్రర్ మూవీస్ డైరెక్ట్ చేసి [more]

Update: 2019-05-20 06:21 GMT

కొరియోగ్రాఫేర్ గా హిట్ అయ్యాక దర్శకుడిగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాని ఫేమ్.. కేవలం కాంచన సీక్వెల్ అంటూ హర్రర్ మూవీస్ డైరెక్ట్ చేసి తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. కాంచనతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి గంగతో సూపర్ హిట్ కొట్టిన రాఘవ కాంచన 3తో ఫ్లాప్ కొట్టినా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఇక కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన కాంచన సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ రాఘవ డైరెక్షన్ లో లక్ష్మీ బాంబ్ గా రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న లక్ష్మీ బాంబ్ సినిమా నుండి రాఘవ లారెన్స్ బయటికొచ్చేసాడు. బాలీవుడ్ లో కాంచనని రీమేక్ చేస్తున్న నిర్మాతలు రాఘవ లారెన్స్ ని అవమానించడం వల్లనే రాఘవ బయటికొచ్చేసాడట.

నిర్మాతలు అవమానించడంతో

అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ఫస్ట్ లుక్ లో దర్శకుడిగా రాఘవ పేరు వెయ్యకుండా మొత్తం తామే అన్నట్టుగా నిర్మాతలు వ్యవహరించడం… ఆ ఫస్ట్ లుక్ లో అక్షయ్ కుమార్ పేరు మాత్రమే వెయ్యడంతో నిర్మాతలు తనని కావాలనే ఆవనిస్తున్నారని భావించిన రాఘవ లారెన్స్ ఆ సినిమా డైరెక్షన్ నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. అలాగే లక్ష్మీ బాంబ్ షూటింగ్ జరుగుతున్న టైం లోనూ రాఘవను నిర్మాతలు ముప్పుతిప్పలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ సినిమా దర్శకత్వం నుండి రాఘవ తప్పుకున్నప్పటికీ రీమేక్ రైట్స్, స్క్రీన్ ప్లే, కథ ఇలా మొత్తం అక్షయ్ కుమార్ కి అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది ఇందులో అక్షయ్ పాత్ర ఎంత ఉందో తెలియదు కానీ.. అక్షయ్ కుమార్ కూడా నిర్మాతలను వారించలేదని రాఘవ సన్నిహితులు దగ్గర వాపోయినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News