అరవిందలో పూజ పాత్ర ఏంటో తెలుసా..?

Update: 2018-09-17 07:45 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ అని తెలిసిన విషయమే. ఇందులో పూజ జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందని టాక్ వస్తుంది. అయితే వీడియో జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందా లేదా కెమెరాకు ముందు ఉండి ప్రశ్నలు అడిగే జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఇలా జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించలేదు. తొలిసారిగా పూజ కనిపించనుంది. విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లేదా వీడియో జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందని మరో టాక్ వినిపిస్తుంది. మరి ఆమెకు ఎన్టీఆర్ ఎలా సెట్ అవుతాడనేదే సస్పెన్స్ .

దసరా కానుకగా...

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రోడిగా కనిపించనున్నాడు. ఇక పూజ హెగ్డే, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయని ఫిలింనగర్ సమాచారం. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పాటలు ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి.

Similar News