బన్నీసినిమా కథ కొట్టేసిందేనా..?

త్రివిక్రమ్ కాకుండా బన్నీ వేణు శ్రీరామ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వేణు చెప్పిన కథ విన్న బన్నీ వెంటనే చేసేద్దాం అని చెప్పాడంట. దీంతో [more]

Update: 2019-04-16 07:32 GMT

త్రివిక్రమ్ కాకుండా బన్నీ వేణు శ్రీరామ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వేణు చెప్పిన కథ విన్న బన్నీ వెంటనే చేసేద్దాం అని చెప్పాడంట. దీంతో కథలో అంతగా ఏముందో ఎవరికీ అర్ధం కాలేదు. ఆల్రెడీ ఈ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ కూడా ప్రటించారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో వేణు శ్రీరామ్ రెడీగా ఉన్నాడట. కథ విన్న బన్నీ కదిలిపోయాడని చెబుతున్నారు. అంతలా ఆకట్టుకునే కథ ఏమై ఉంటుంది అని ఆరా తీస్తే… అది ఒక ఫిలిప్పైన్స్ సినిమా కథ అని తెలుస్తుంది. 2017లో ‘కిట కిట’ (KITA KITA) అనే టైటిల్ తో అక్కడ రిలీజ్ అయింది. కిటకిట అంటే ‘ఐ విల్ సీ యూ’ అనేది ఇంగ్లీష్ అర్థం.

అంధురాలి కథాంశంతో…

ఇందులో ఓ అంధురాలు తను ఇష్టపడే అబ్బాయి కోసం సాగించే అన్వేషణ ప్రధాన కధాంశం. టూరిస్ట్ గైడ్ గా పని చేసే యువతి తాత్కాలికంగా అంధురాలు కావడం, ఆమె టూరిస్ట్ ప్రదేశాలు అన్నీ తిరుగుతూ అతని కోసం అన్వేషించడం అన్నది లైన్. అదే స్టోరీతో తెలుగులో తీస్తారా? లేదా ఏమైనా మార్పులు చేసి సినిమా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అసలు ఇంతకీ ఆ సినిమా రైట్స్ తీసుకున్నారో లేదో కూడా తెలియాలి. ఎందుకంటే ఈ మధ్య లైన్స్ ఊరికే వాడుకోవడం అంత ఈజీ కాదని అర్ధం అయిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News