8 సంవత్సాల తరవాత పవన్ కళ్యాణ్ కోసం నడుం బిగించారు !!

Update: 2017-12-09 07:09 GMT

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాత వాసి కి సంబంధించి ఏ అప్డేట్ అయినా ఇంటర్నెట్ లో అతిపెద్ద సెన్సేషన్ ఐపోతోంది. చాలా తక్కువ టైం లో పవర్ స్టార్ కి సంబంధించి ఒక్క ట్వీట్ వేసినా కూడా లక్షలాది మంది ఫుల్ జోష్ లో ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పాట గురించి డీటెయిల్స్ విడుదల చేసారు .

" గాలి వాలుగా " అని సాగే ఈ పాట రేపు 12 వ తారీఖు న విడుదల కి సిద్దం అవుతోంది. అయితే ఈ పాట కి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండబోతోంది. ఈ పాట ని సిరివెన్నల సీతారామ శాస్త్రి రాసారు. అదివరకు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ - సిరివెన్నెల ముగ్గురి కాంబినేషన్ లో జల్సా లో ' చలోరే చలోరే ' సాంగ్ వచ్చింది. మళ్ళీ దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ తరవాత ఒక పాట రాబోతోంది. ఇంత గ్యాప్ తరవాత సిరివెన్నల, కళ్యాణ్ కోసం ఒక మంచి లవ్ సాంగ్ రాసారు అనీ పవర్ స్టార్ కూడా ఇప్పటికే ఈ సాంగ్ విని ఫుల్ ఖుషీ అయ్యాడు అనీ అంటున్నారు.

ఈ పాట లవర్స్ కి ఒక 'లవ్ యాంతం' లాగా ఉంటుంది అనే టాక్ కూడా ట్విట్టర్ లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా, సిరివెన్నెల పాట, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేకింగ్, కూల్ ప్రదేశాల మధ్యన చూడడానికి కూడా త్రివిక్రమ్ ఈ పాటని చక్కగా షూట్ చేసాడు అంటున్నారు, అందుకే 12 డిసెంబర్ కోసం పవన్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Similar News