ఫ్యాక్ట్ చెక్: బీహార్ కు చెందిన యువకుడు కొన్ని సెకెండ్ల లోనే గూగుల్ ను హ్యాక్ చేశాడా..?

బీహార్ కు చెందిన యువకుడు కొన్ని సెకెండ్ల లోనే గూగుల్ ను హ్యాక్ చేయడంతో సంవత్సరానికి రూ. 3.66 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ లెటర్ పంపింది.

Update: 2022-02-15 05:53 GMT

క్లెయిమ్: బీహార్ కు చెందిన యువకుడు కొన్ని సెకెండ్ల లోనే గూగుల్ ను హ్యాక్ చేయడంతో సంవత్సరానికి రూ. 3.66 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ లెటర్ పంపింది.
ఫాక్ట్: వైరల్ పోస్ట్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేది. రితురాజ్ గూగుల్‌ని హ్యాక్ చేయలేదు. కేవలం వెబ్‌సైట్‌లో 'బగ్‌'ని కనుగొన్నారు. అతను అమెరికాకి వెళ్లడం లేదు. Googleలో ఉద్యోగంలో చేరడం లేదు. రితురాజ్ కేవలం గూగుల్ వెబ్‌సైట్‌లోని లోపం లేదా బగ్ గుర్తించి గూగుల్‌కి తెలియజేశాడు.

హ్యాకర్లు పలు రకాలు.. తమ తెలివి తేటలతో పెద్ద పెద్ద కంపెనీలను కూడా బురిడీ కొట్టిస్తూ ఉంటాయి. హ్యాకింగ్ నైపుణ్యం కనబరిచిన వ్యక్తులకు టెక్ దిగ్గజాల నుండి జాబ్ ఆఫర్‌లు వచ్చిన వార్తలు మీరు వినే ఉంటారు. బీహార్‌కు చెందిన ఓ యువకుడు ఏకంగా గూగుల్ నే హ్యాక్ చేశాడని అది కూడా కొన్ని సెకెండ్ల సమయంలో చోటు చేసుకుందనే ప్రచారం సాగుతోంది.
రితురాజ్ చౌదరి అనే యువకుడు అసాధారణమైన పనిని చేశాడని పలువురు పోస్టులు పెడుతున్నారు. అతను ప్రపంచంలోని అతిపెద్ద సెర్చ్ ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్‌ను సెకన్ల వ్యవధిలో హ్యాక్ చేశాడని చెబుతున్నారు.

హిందీలో వైరల్ అయిన పోస్ట్ లో "ఈ వ్యక్తి, రితురాజ్ చౌదరి, గూగుల్ ని 51 సెకన్ల పాటు హ్యాక్ చేశాడు. USAలోని Google అధికారులు ఏమి జరుగుతుందో తెలియక తికమక పడ్డారు. కానీ రీతురాజ్ Google సేవలను పునఃప్రారంభించాడు. సిస్టమ్‌ను హ్యాక్ చేయడానికి వారి వెబ్‌సైట్‌లోని లోపం గురించి వారికి మెయిల్ చేశాడు. Google అమెరికాలో 12 గంటలపాటు సమావేశాన్ని నిర్వహించింది. చివరకు రితురాజ్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. అతనికి సంవత్సరానికి రూ. 3.66 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ లెటర్ పంపింది. రితురాజ్‌కి పాస్‌పోర్టు లేదు. గూగుల్ భారత ప్రభుత్వంతో మాట్లాడింది. పాస్‌పోర్ట్ రెండు గంటల్లో అతని ఇంటికి చేరుకుంది. రితురాజ్ ప్రైవేట్ జెట్‌లో అమెరికా వెళ్లనున్నాడు. అతను IIT మణిపూర్‌లో B.Tech రెండవ సంవత్సరం చదువుతున్నాడు. బీహార్‌లోని బెగుసరాయ్ సమీపంలోని ముంగేర్‌గంజ్ అనే చిన్న గ్రామానికి చెందినవాడు." అని ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

మా బృందం ఈ వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని గుర్తించింది.

రితురాజ్ గూగుల్‌ని హ్యాక్ చేయలేదు కానీ వారి వెబ్‌సైట్‌లో 'బగ్‌'ని కనుగొన్నారు. అతను అమెరికాకి వెళ్లడం లేదు. Googleలో ఉద్యోగంలో చేరడం లేదు. కీవర్డ్స్ ను ఉపయోగించి మేము సెర్చ్ చేయగా అందుకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ DNA లో కనిపించింది. ఆ వార్తా కథనంలో వైరల్ పోస్టుకు సంబంధించిన కల్పిత కథనం ఎక్కడా కనిపించలేదు. రితురాజ్ కేవలం గూగుల్ వెబ్‌సైట్‌లోని లోపం లేదా బగ్ గుర్తించి గూగుల్‌కి తెలియజేశాడు.

ఫిబ్రవరి 3న దైనిక్ భాస్కర్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, గూగుల్ కూడా తమ సైట్ లో లోపాన్ని అంగీకరించింది. రితు రాజ్ చౌదరికి అక్నాలెడ్జ్ మెయిల్ పంపింది. తమ వెబ్‌సైట్‌లో లోపాలను గుర్తించిన వారికి గూగుల్ తరచుగా రివార్డ్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం చౌదరి కనుగొన్నవి ఫేజ్-2 స్థాయిలో ఉన్నాయి. అతడు ఫేజ్-0కి చేరుకున్నప్పుడు అతనికి Google అవార్డును అందజేస్తుంది.

చాలా మంది పరిశోధకులు/టెక్ నిపుణులు Google నిర్వహిస్తున్న "
బగ్ హంట్
"లో పని చేస్తున్నారు. ఇది ఫేజ్-5లో మొదలై ఫేజ్-0 వరకు వెళుతుంది. గూగుల్ పరిశోధకుల జాబితాలో చౌదరి పేరు చేర్చబడిందని ఆజ్‌తక్ నివేదిక ధృవీకరించింది. చౌదరి పేరు ఉన్న గూగుల్ బగ్ హంటర్‌ల జాబితాను కూడా కనుగొన్నాము.

లాలాన్‌టాప్‌తో రితు రాజ్ చౌదరి మాట్లాడుతూ.. గూగుల్‌లో రూ. 3.66 కోట్ల విలువైన ఉద్యోగం సంపాదించి, యుఎస్‌ఎకు వెళ్లడంపై వచ్చిన పుకార్లను ఖండించారు. చౌదరి తాను ఐఐటి-మణిపూర్ విద్యార్థిని కాదని - మణిపూర్‌లో ఐఐటి లేదని చెప్పారు. అతను నిజానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మణిపూర్ (IIIT-మణిపూర్)విద్యార్థి అని చెప్పుకొచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం సంపాదించి రాష్ట్రాలకు వెళ్లడంపై వచ్చిన పుకార్లన్నీ అబద్ధమేనని చెప్పుకొచ్చాడు. గంటల వ్యవధిలో పాస్‌పోర్ట్‌ను తయారు చేయడం అసాధ్యమని తెలిపారు. Google నుండి రివార్డ్ గురించి అతడిని అడగగా.. గూగుల్ బగ్‌ని పరిష్కరించిన తర్వాత రివార్డ్‌లను ఇస్తుంది. అందుకు రెండు మూడు నెలల సమయం పడుతుందని వివరించారు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ఉన్నాయి.



క్లెయిమ్: బీహార్ కు చెందిన యువకుడు కొన్ని సెకెండ్ల లోనే గూగుల్ ను హ్యాక్ చేశాడా

క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు

ఫ్యాక్ట్: వైరల్ పోస్టులు అబద్ధం


Claim :  Rituraj Chaudhary from Bihar was offered a job at Google after hacking into their servers. Google called him to the USA offering a package of Rs 3.66 crores per annum.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News