ఫ్యాక్ట్ చెక్: ఆ బంగారు ఆభరణాలకు టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్ రెడ్డికి సంబంధం ఉందా..?

ఓ వైరల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. అందులో ఓ బెంచ్ మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి.

Update: 2022-01-04 09:48 GMT

ఓ వైరల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. అందులో ఓ బెంచ్ మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు జె.శేఖర్ రెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడిలో స్వాధీనం చేసుకున్న బంగారం, నగదును తమిళనాడు పోలీసులు రికవరీ చేసినట్లుగా వీడియో షేర్ చేయబడుతోంది.

వైరల్ వీడియోకు మరి కొంత సమాచారం యాడ్ చేసి 'ప్రియమైన తిరుమల తిరుపతి భక్తులారా! మీ డొనేషన్, బంగారం 17 మంది ట్రస్టీలలో ఒకరైన జె.శేఖర్ రెడ్డి దగ్గర ఉంది. ఐటీ అధికారులు అతని ఇంటిపై దాడి చేసి ₹106 కోట్ల నగదు, 127 కిలోల బంగారం మరియు ₹ 10 కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు ఉన్నాయి. టీటీడీకి చెందిన మిగిలిన 16 మంది ధర్మకర్తల సంగతేంటి. ఈ డబ్బును మత మార్పిడికి ఉపయోగించబడుతోందా?'. అంటూ పోస్టులు పెట్టడం గమనించవచ్చు.



తిరుపతిలో పనిచేస్తున్న పూజారి ఇంట్లో ఇటీవల జరిగిన దాడిలో బంగారం బయటపడిందని పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు కొన్ని స్క్రీన్‌షాట్‌లను కూడా పోస్ట్ చేశారు.
Full View

Full View
నిజ నిర్ధారణ
వైరల్ అవుతున్న వీడియోకు టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు.

తమిళనాడు పోలీసులు రికవరీ చేసిన ఆభరణాలకు సంబంధించిన వీడియో తప్పుడు వాదనతో షేర్ చేయబడుతోంది. ఇది జె శేఖర్ రెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడిలో స్వాధీనం చేసుకున్న బంగారం కాదు.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇదని మా బృందం కనుగొంది.

మేము ట్విట్టర్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా.. న్యూస్ 18 తమిళనాడు ఇన్‌పుట్ ఎడిటర్ మహాలింగం పొన్నుసామి డిసెంబర్ 20న చేసిన ట్వీట్‌ను గుర్తించాము. వైరల్ అవుతున్న వీడియో.. పొన్ను స్వామి పోస్టు చేసిన వీడియో ఒకటేనని గుర్తించాము.
"వెల్లూర్ జోస్ అలుక్కాస్ నగల దుకాణం గోడకు రంధ్రం చేసి, 15 కిలోల బంగారం, వజ్రాభరణాలను దోచుకున్న దొంగను వెల్లూర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు." అని ఒరిజినల్ పోస్టులో ఉంది.

డిసెంబర్ 21న స్మశాన వాటిక నుండి దొంగిలించబడిన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21, 2021న 'ది హిందూ'లో ప్రచురించిన కథనం ప్రకారం, పల్లికొండ సమీపంలోని కూచిపాళయం గ్రామానికి చెందిన 23 ఏళ్ల టీకే రామన్, 16 కిలోల బంగారు, వజ్రాభరణాలను దొంగిలించినందుకు వెల్లూర్ పోలీసులు అరెస్టు చేశారు.దాదాపు 8 కోట్ల రూపాయల బంగారం అని అంచనా వేస్తున్నారు. దొంగిలించిన వస్తువులను ఒడుగత్తూరులోని శ్మశాన వాటికలో స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

జె శేఖర్ రెడ్డి కేసు

మేము జె శేఖర్ రెడ్డిపై కీవర్డ్ సెర్చ్ చేసాము. అతనికి చెందిన ఆస్తులపై జరిగిన దాడి గురించి 2016 నుండి వచ్చిన వార్తా నివేదికలను కనుగొన్నాము.

డిసెంబర్ 9, 2016న డెక్కన్ క్రానికల్‌లో ప్రచురితమైన వార్తాకథనంలో టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్ రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి రూ. 100 కోట్ల నగదు, 120 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
భారీ నగదు పట్టుబడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నుండి శేఖర్ రెడ్డిని తొలగించింది.
అయితే, 2019లో AP ప్రభుత్వం రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి ప్రత్యేక ఆహ్వానితునిగా నామినేట్ చేసింది. ఆ తర్వాత, సెప్టెంబర్ 2020లో ప్రత్యేక CBI కోర్టు 2016 ఐటీ దాడుల కేసులో 'సాక్ష్యాధారాల కొరత కారణంగా' ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు.. జె.శేఖర్ రెడ్డి ఉదంతానికి ఎటువంటి సంబంధం లేదు.
Claim :  ఆ బంగారు ఆభరణాలకు టీటీడీ బోర్డు సభ్యుడు జె.శేఖర్ రెడ్డికి సంబంధం ఉందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News