ఫ్యాక్ట్ చెక్: అసదుద్దీన్ ఒవైసీ మోహన్ భగవత్ పక్కన కూర్చున్నారా..?

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్‌తో కలిసి సోఫాలో కూర్చున్నట్లు చూపించే వైరల్ చిత్రం వైరల్ అవుతోంది.

Update: 2022-01-23 05:01 GMT

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్‌తో కలిసి సోఫాలో కూర్చున్నట్లు చూపించే వైరల్ చిత్రం వైరల్ అవుతోంది.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2022కి ముందు ఆర్‌ఎస్‌ఎస్, ఎఐఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారనే వాదనతో ఆ చిత్రం షేర్ చేయబడింది.

ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 2022 నుండి మార్చి 7, 2022 వరకు 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఫలితాలు మార్చి 10, 2022న ప్రకటించబడతాయి. వైరల్ ఫోటోలో ఒవైసీ, భగవత్ కలిసి కూర్చున్నట్లు చూపబడింది. "మోహన్ భగవత్ కోసం హైదరాబాదీ ఖిచ్డీని తయారు చేసేందుకు ఒవైసీ చేరుకున్నారు. బీజేపీ బీ టీమ్ కాదు కదా" అనే క్యాప్షన్‌తో చిత్రం షేర్ చేయబడింది.
Full View


"मोहन भागवत के यहां हैदराबादी खिचड़ी बनाने पहुंचे ओवैसी... कहीं भा ज पा की बी टीम तो नहीं ?" అంటూ ఫోటోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలను మార్ఫింగ్ చేశారని తెలుస్తోంది. ఈ వైరల్ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాము. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ద్వారా ఒరిజినల్ చిత్రం డిసెంబర్ 21, 2021 న ట్వీట్ చేయబడిందని కనుగొన్నారు. చిత్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, మోహన్ భగవత్ ఉన్నారు.


డిసెంబర్ 21, 2021న ప్రచురించబడిన News18 నివేదిక ప్రకారం, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలి వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి ములాయం సింగ్ యాదవ్ హాజరైనప్పుడు చిత్రం క్లిక్ చేయబడింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒరిజినల్ ఫోటోను పోస్టు చేసింది.
Full View

ఈ చిత్రంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తండ్రి వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఈ ఫోటో తీశారని తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ కూడా ఉన్నారని ఆయన అన్నారు.

రెండు ఫోటోలకు సంబంధించిన తేడాలను మీరు గమనించవచ్చు.

ఒరిజినల్ ఫోటో లోని ములాయం సింగ్ యాదవ్ స్థానంలో.. ఒవైసీ ఫోటోను మార్ఫింగ్ చేసి ఉంచారు.

ఈ ఫోటో వైరల్‌ చేయడాన్ని ఎంఐఎం సీరియస్‌గా తీసుకుంది. తమ పార్టీ అధినేత ఆర్ఎస్ఎస్ నేతలతో కలసి కూర్చున్నట్లు ఫొటోను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ పోలీసులను ఆశ్రయించారు. అసదుద్దీన్ ఒవైసీ ఫోటోను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్న వ్యక్తి పై తక్షణమే చర్యలు తీసుకోవా లని అజంపురా కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్బార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఎంఐఎం నేత ఫిర్యాదు చేశారు. మలక్ పేటకు చెందిన మహ్మద్ అహ్మద్ ఖలీల్ అనే వ్యక్తి అసద్ ఫొటోను మార్ఫింగ్ చేశారని అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ అబ్బార్ ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాబట్టి ఈ వైరల్ ఫోటోలో ఉన్నది అసదుద్దీన్ ఒవైసీ కాదు.


Claim :  AIMIM President Asaduddin Owaisi sitting on a sofa with RSS Chief Mohan Bhagwat
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News