370 ఏం చెబుతోంది…?

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను తొలగించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వం లోక్ సభ, రాజ్యసభల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రతిపాదనలను పెట్టింది. [more]

Update: 2019-08-05 17:30 GMT

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను తొలగించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వం లోక్ సభ, రాజ్యసభల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రతిపాదనలను పెట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాశ్మీర్ పండిట్లు ఈ ఆర్టికల్ రద్దు పట్ల హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆర్టికల్ ఏం చెబుతోంది? ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూకాశ్మీర్ ప్రజలు ఏ రకమైన లబ్ది పొందుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

ఈ ఆర్టికల్ తో…..

రాజకీయంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలను తరచూ రద్దు చేయడం, కాశ్మీర్ ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకూ ఎనిమిది ప్రజా ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించారు. పరోక్షంగా ఢిల్లీ తమపై పెత్తనం చేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతుంది. ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితిని చక్కదిద్దవచ్చన్నది జాతీయ వాదుల అభిప్రాయంగా ఉంది. ఈ ఆర్టికల్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలో రాష్ట్రేతరులు నివసించరాదు. పర్యాటకులుగా వెళ్లడం తప్ప అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీలులేదు. ఫలితంగా స్థానికులు ఆడింది …ఆట… పాడింది.. పాటగా మారింది. వారికి ఎదురులేకుండా పోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా స్థానికుల ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల వారు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందవచ్చు.పరిశ్రమలు ఏర్పాటయి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా ఉగ్రవాదం వైపునకు యువత మొగ్గు చూపదు.

రాజ్యాంగంలోని 370 వ అధికరణం జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది
జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది.

జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.
మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు
జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు

జమ్మూ – కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు ఆదేశం చెల్లుబాటు కాదు
భారత పార్లమెంటు నిబంధనల విషయంలో చాలా పరిమిత స్థలాలలో చట్టాలు చేయవచ్చు

జమ్ము-కాశ్మీర్లో,
ఒక కాశ్మీరి మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ మహిళకు కాశ్మీరీ పౌరసత్వం ముగుస్తుంది.
ఒక కాశ్మీరి మహిళ పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ – కాశ్మీర్ పౌరసత్వాన్ని పాకిస్థానీ పొందుతాడు.
విభాగం 370 కారణంగా
కాశ్మీర్లో సమాచార హక్కు వర్తించదు.

ఆర్టీఏ అమలు కాదు…
భారత చట్టాలు వర్తించవు.

షరియా చట్టం కాశ్మీర్లో మహిళలకు వర్తిస్తుంది.

కాశ్మీర్లో పంచాయతీలకు హక్కులు లేవు.

కాశ్మీర్లోని మైనారిటీలు [హిందువులు మరియు సిక్కులు] 16% రిజర్వేషన్లు పొందలేరు.
విభాగం 370 కారణంగా
ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు.

370 సెక్షన్ల వలన పాకిస్థానీయులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి.

Tags:    

Similar News