జబర్దస్త్ కి నాగబాబు గుడ్ బై ...?

Update: 2017-12-16 02:46 GMT

పాపులర్ టివి షో జబర్దస్తు కి నాగబాబు గుడ్ బై కొట్టనున్నారా ..? దీనిపై గాసిప్స్ సోషల్ మీడియా వేదికపై హల్చల్ చేస్తున్నాయి. ఎందుకిలా అంటే. పవర్ స్టార్ సోదరుడు నాగబాబు కి రోజా రూపంలో చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రయివేట్ ఛానెల్ వారసత్వ రాజకీయాలపై చర్చ పెట్టింది. ఈ చర్చలో వైసిపి ఎమ్యెల్యే ఆర్కే రోజా నిర్మాత పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ నడుమ బూతుల యుద్ధమే సాగింది. రోజా బండ్ల గణేష్ పవన్ లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు పికె ఫ్యాన్స్ ను తీవ్రంగా హార్ట్ చేశాయి.

పవన్ అభిమానుల నుంచి నాగబాబుకు వత్తిడి ....

ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఈ గొడవొచ్చి రోజా తో కలిసి జబర్దస్తు షో చేస్తున్న నాగబాబు కు చుట్టుకుంది. రోజా తో కలిసి ఆ కార్యక్రమం చేయడానికి ఒప్పుకోమని తక్షణం ఈ కార్యక్రమం లో ఎవరో ఒకరే వుండాలని పికె ఫ్యాన్స్ నాగబాబు పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి మొదలు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా క్యాంపైన్ సైతం స్టార్ట్ చేశారు. ఇది నాగబాబు కి తలపోటుగా మారింది. వాస్తవానికి క్యారెక్టర్ నటుడిగా మంచి పేరు సంపాదించి తన పిల్లలను టాలీవుడ్ లో ప్రమోట్ చేసుకునే క్రమంలో వెండితెరకు దూరమయిన నాగబాబుకు జబర్దస్త్ గొప్ప గుర్తింపు తెచ్చింది. ఆ షో కి కూడా సూపర్ రేటింగ్ వుంది. రోజా తో వేదిక పంచుకుంటే పవన్ అభిమానులతో తంటా, చేయకపోతే మంచి గుర్తింపు ఇచ్చిన కార్యక్రమం వదులుకున్నట్లు అవుతుంది. దాంతో ఎటు తేల్చుకోలేక ఈ వివాదంపై మౌనముద్రలోకి వెళ్లిపోయారు నాగబాబు.

Similar News