కాషాయ కూటమిలో జోష్

Update: 2017-01-07 13:34 GMT

నోట్ల రద్దు తర్వాత కూడా కమలం వికసిస్తోంది. వరుసగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 35 వార్డుల్లో 30 స్థానాలను గెలుచుకుని బీజేపీ సత్తా చాటింది. నోట్ల రద్దు తర్వాత వరుసగా జరిగిన చండీఘర్, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం కమలనాధులు జెండా పాతేశారు. దీంతో నోట్ల రద్దు ప్రభావం ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కాషాయ పార్టీ ఒక కన్ క్లూజన్ కు వచ్చేసింది.

ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామన్న ధీమా కాషాయ దళంలో వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఇప్పటికే నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి అవకాశాలున్నాయని తేలడంతో బీజేపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. అయితే స్థానిక సంస్థలు అర్బన్ ఓటర్లుంటారని, గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మనోభావం ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నాయి విపక్షాలు. మొత్తం మీద స్థానిక సంస్థల్లో వచ్చిన గెలుపుతో కాషాయ కూటమి మంచి జోష్ మీద ఉందని చెప్పక తప్పదు.

Similar News