ఊడ్చేస్తారటగా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. అన్ని సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన [more]

Update: 2020-02-08 16:30 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. అన్ని సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేయడం ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్యనే ఉండనుంది. కాంగ్రెస్ ఇక్కడ మూడోస్థానానికి పడిపోనుంది.

పార్లమెంటు ఎన్నికల్లో….

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏడింటికి ఏడు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఏ స్థానంలో గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచింది. కేజ్రీవాల్ పార్టీ పూర్తిగా చతికలపడింది. ఇందుకు ప్రధాన కారణం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడమే కారణం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసిందనే చెప్పాలి. బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం.

కాంగ్రెస్ వీక్ కావడంతో…..

అలాగే ప్రచారం కూడా రాహుల్, ప్రియాంక గాంధీ తప్ప పెద్దగా ఎవరూ పాల్గొనలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా కాంగ్రెస్ ప్రకటించలేదు. సీఏఏ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్ద యెత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని భావించి బీజేపీ వ్యతిరేక ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకే పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఆప్ వైపు మొగ్గు చూపడంతో కేజ్రీవాల్ పార్టీ విజయం ఖాయమంటున్నారు.

చివరకు గట్టి పోటీ…

భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చేందుకు పోలింగ్ చివరి క్షణం వరకూ ప్రయత్నించింది. అయితే బీజేపీ పది నుంచి పదిహేను స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఓట్లు చీలి తాము లాభపడతామన భావించిన బీజేపీకి ఆ ఓట్లు ఆమ్ ఆద్మీకి టర్న్ అవ్వడంతో విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని భావించిన సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆప్ కు మళ్లడం వల్లనే కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం జార్ఖండ్ తరహా ఫలితాలు వస్తాయంటున్నారు.

Tags:    

Similar News