జీరో పెర్ ఫార్మెన్స్ మినిస్టర్ ఈయనేనట

సుదీర్ఘ ల‌క్ష్యాలు-త‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాలు.. అనే కాన్సెప్ట్‌తో ఏర్ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రుల‌కు కూడా జ‌గ‌న్ ఇదే సూత్రాన్ని ఆపాదించారు. మంత్రులు అంద‌రూ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, సొంత [more]

Update: 2019-10-16 08:00 GMT

సుదీర్ఘ ల‌క్ష్యాలు-త‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాలు.. అనే కాన్సెప్ట్‌తో ఏర్ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రుల‌కు కూడా జ‌గ‌న్ ఇదే సూత్రాన్ని ఆపాదించారు. మంత్రులు అంద‌రూ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, సొంత లాభాల‌ను క‌ట్టిపెట్టాల‌ని కూడా జగన్ ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో మంత్రులు అంద‌రూ త‌మ‌కు అప్ప‌గిం చిన బాధ్య‌త‌ల‌ను చాలా వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇప్ప‌టికి నాలుగు మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయా మంత్రుల ప‌నితీరు ఎలా ఉంద‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

జగన్ స్పీడ్ కు అనుగుణంగా….

ఈ క్ర‌మంలో తొలిసారి మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టిన వారిపై జగన్ మ‌రింత‌గా దృష్టి పెడుతున్నారు. ఇలా తొలి సారి మంత్రి అయిన వారిలో చాలా మంది స్పీడ్‌గానే ప‌నులు చేసుకుని పోతున్నారు. అదే స‌మ‌యంలో విప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా తిప్పికొడుతున్నారు. అయితే, వీరిలోనూ ఒక‌రిద్ద‌రు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఇలా సైలెంట్‌గా ఉంటున్న వారిలో మ‌రింత సైలెంట్‌గా ఉన్న నాయ‌కుడు, మంత్రి చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈయ‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉండ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

నమ్మకస్థుడిని కాదని….

త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన ముదునూరు ప్ర‌సాద‌రాజును కాద‌ని మ‌రీ జ‌గ‌న్ రంగ‌నాథ‌రాజుకు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌కంగా భావిస్తున్న గృహ నిర్మాణ శాఖ‌ను రంగ‌నాథ‌రాజుకు అప్ప‌గించారు. అయితే, ఈయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న‌కు మ‌న‌సంతా మ‌రో శాఖ‌పై ఉండ‌డంతో త‌న‌కు కేటాయించిన శాఖ‌పై మ‌న‌సు ల‌గ్నం చేయ‌లేక పోతున్నార‌ని అంటు న్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే పనిలో ఉంది. ఉగాది నాటికి ఈ ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తిచేయ నుంది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశముంది.

చురుగ్గా వ్యవహరించడం లేదని….

సుమారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 1.70 లక్షల ఇళ్లని నిర్మించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, త‌న శాఖ‌కే చెందిన ఈ విష‌యంలో మంత్రి చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌య‌సు రీత్యా కూడా ఆయ‌న యాక్టివ్ లేక‌పోవ‌డం, త‌న ప్ర‌యోజ‌నాలు వేరేగా ఉండ‌డంతో గృహ నిర్మాణ శాఖ‌పై పెద్ద‌గా శ్ర‌ద్ధ చూపించ‌లేక పోతున్నార‌ని, అందుకే ఆయ‌న వెనుక‌బ‌డి పోతున్నార‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News