బ్రేకింగ్ : వైఎస్ వివేకా మృతి… జగన్ కుటుంబంలో విషాదం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి  (68)గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితం పులివెందులలోని [more]

Update: 2019-03-15 02:35 GMT

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి (68)గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. కడప పార్లమెంటు ఎన్నికకు రెండు సార్లు వివేకా పోటీ చేశఆరు. 2009లో వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. కిరణ‌్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వివేకా కొంతకాలం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు.

నిన్ననే పులివెందుల వెళ్లి…..

జగన్ వెంటే ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. నిన్నటి వరకూ లోటస్ పాండ్ లోనే ఉన్న వివేకా పులివెందులకు బయలుదేరారు. వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని పులివెందులకు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన వివేకా హఠాన్మరణంతో పులివెందులలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News