ఆ…. బ్యాచ్ కి గుణపాఠం …!!

సోషల్ మీడియా ఇప్పుడు దేశంలోని వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న వేదిక. సొంత ఆలోచనలు, కష్టపడే తత్త్వం ఉంటే డాలర్లు తెచ్చిపెట్టే రాచమార్గం. అయితే ఈ మార్గంలో [more]

Update: 2019-01-20 09:30 GMT

సోషల్ మీడియా ఇప్పుడు దేశంలోని వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న వేదిక. సొంత ఆలోచనలు, కష్టపడే తత్త్వం ఉంటే డాలర్లు తెచ్చిపెట్టే రాచమార్గం. అయితే ఈ మార్గంలో సక్రమంగా వెళితే బాగానే ఉంటుంది. షార్ట్ కట్ లో డబ్బు ఆర్జించాలని భావించి ఒక మంచి అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు కొందరు. వీరు వెళ్లే తప్పుడు మార్గం వల్ల సక్రమంగా సోషల్ మీడియా సైట్స్ నిర్వహించేవారు సైతం వీరిబాటలో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది.

అసత్యాన్ని సత్యంగా చిత్రీకరిస్తూ …

రేటింగ్స్ కోసం వ్యూస్ కోసం లేని వార్తలను ఉన్నట్లు క్రియేట్ చేయడం, బతికున్నవారిని కూడా చంపేయడం, చచ్చినవాళ్లను బతికించడం వంటి చిత్ర విచిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై కనిపిస్తున్నాయి. ఇలాంటివి చూసి నిజం తెలిసాకా నవ్వుకున్నా ఫరవాలేదు కానీ వ్యక్తిత్వ హనన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ మీడియా లో దర్శనమిస్తుంది. అందులో ముఖ్యంగా మానవ బలహీనతలను దృష్టి లో పెట్టుకుని మహిళల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు కొందరు. వీరి బారిన పడి ఎందరో సెలబ్రెటీలు సమాజంలో గుర్తింపు ఉన్నవారి సంసారాలు చట్టబండలు అవుతున్నాయి. చాలా మంది ఇలాంటి వార్తలు లైట్ తీసుకుంటే మరికొందరు మానసికంగా కుమిలి పోతున్నారు. ధైర్యంగా బూతు బ్యాచ్ పై పోరాటానికి కొంత కాలంగా సినీ నటి హేమ వంటివారు నడుం కట్టారు. కానీ ఆమె కూడా సీరియస్ గా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు.

షర్మిల స్పూర్తితో …

వైఎస్ షర్మిల వ్యక్తిగత జీవితంపై గత ఐదేళ్ళుగా చల్లని బురద లేదు. చాలా కాలం క్రితం దీనిపై ఒక ఫిర్యాదు చేసి కొందరిపై చర్యల తరువాత మౌనం దాల్చిన షర్మిల ఇప్పుడు ఈ వ్యవహారం అంతు చూడటానికి ఉద్యమించారు. దీనికి తెలంగాణ పోలీస్ అండగా నిలిచింది. అంతే ప్రతివారికి బూతు పురాణం అంటగట్టి నడిపిస్తున్న వెబ్ సైట్స్, ఛానెల్స్ బాగోతాలు బయటకు వస్తున్నాయి. వీరికి అరెస్ట్ నోటీసులు జారీ చేస్తూ వెనుక వున్న వారికోసం వేట సాగిస్తూ సైబర్ క్రైమ్ హల్ చల్ చేస్తుంది. ఈ దెబ్బతో వ్యక్తిత్వ హనానికి పాల్పడి కాసులు దండుకోవాలనుకునే వారికి, రాజకీయంగా అవతలి వారిపై బురద జల్లాలని కుట్ర చేసే వారికి వణుకు మొదలైంది. ఇదే స్పూర్తితో మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో అక్రమ మార్గంలో ఆర్జన చేయాలని భావించే వారు తమ మార్గాన్ని మార్చుకునే అవకాశాలు కొంతైనా ఉంటాయి

Tags:    

Similar News