ఆ ముగ్గురికి మంత్రి పదవి గ్యారంటీ అట …?

సామాజిక సమీకరణలతో నామినేటెడ్ పోస్ట్ లను చక్కగానే భర్తీ చేసింది వైసీపీ. అయితే ఈ పదవుల పందేరం లో ముగ్గురు ఎమ్యెల్యేలకు డిమోషన్ కావాలిసి వచ్చింది వారు [more]

Update: 2021-08-21 03:30 GMT

సామాజిక సమీకరణలతో నామినేటెడ్ పోస్ట్ లను చక్కగానే భర్తీ చేసింది వైసీపీ. అయితే ఈ పదవుల పందేరం లో ముగ్గురు ఎమ్యెల్యేలకు డిమోషన్ కావాలిసి వచ్చింది వారు ముగ్గురే ఆర్ కె రోజా, జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు. ఏపిఐఐసి చైర్మన్ గా రోజా, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు నిన్నటివరకు ఆ పదవుల్లో కొనసాగారు. అయితే వీరి కి వైవి సుబ్బారెడ్డి తరహాలో పదవీకాలం పెంచలేదు ముఖ్యమంత్రి. దీనికి కారణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయం గా మారాయి.

బరువు పెంచడం ఇష్టం లేదుట …

ఇప్పటికే ఎమ్యెల్యేలుగా నియోజకవర్గాల్లో బరువు బాధ్యతలు వారి తలపై ఉన్నాయి. అదనంగా కార్పొరేషన్ ఛైర్మెన్ గిరి లు ఉండటంతో తమ పనులు వారు సక్రమంగా చేయలేకపోతున్నారు. అందుకే తొలగించి వేరేవారికి ఇచ్చాం అని ఈ వ్యవహారాన్ని సమర్థిస్తున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. వాస్తవానికి వీరి ముగ్గురికి రాబోయే రోజుల్లో మంత్రి పదవులు ఇచ్చే జాబితాలో ఉన్నారని చెప్పే పదవులు తొలగించరాని వైసీపీలో టాక్ నడుస్తుంది.

అందుకే తప్పించారా?

రాబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొందరికి మంత్రిపదవులు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే వీరి పదవులను వేరే వారికి నాలుగైదు నెలలు ముందుగానే వేరే వారికి కట్టబెట్టారన్న టాక్ నడుస్తుంది. అందువల్లే ఎలాంటి అసంతృప్తులు లేకుండా ముగ్గురు స్వచ్ఛందంగా తప్పుకున్నారని రాబోయే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రెండేళ్లపాటు నామినేటెడ్ పోస్టుల్లో ఉండటంతో వారిని తప్పించారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మరి మంత్రివర్గ విస్తరణలో వీరికి చోటు లభిస్తుందా? లేదా? అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News