మ‌రీ ఇంత ద‌గ్గర‌వుతార‌ని అనుకోలేదు.. వైసీపీపై బీజేపీ టాక్‌

తాజా ప‌రిణామాల‌తో కేంద్రంలోని మోడీ సర్కారుకు వైసీపీ మ‌రింత ద‌గ్గరైంది. దేశంలోని స‌గానికిపైగా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న వ్యవ‌సాయ బిల్లుకు వైసీపీ మ‌ద్దతు తెల‌ప‌డ‌మే కాదు.. బీజేపీ బ‌ద్ధ [more]

Update: 2020-09-28 12:30 GMT

తాజా ప‌రిణామాల‌తో కేంద్రంలోని మోడీ సర్కారుకు వైసీపీ మ‌రింత ద‌గ్గరైంది. దేశంలోని స‌గానికిపైగా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న వ్యవ‌సాయ బిల్లుకు వైసీపీ మ‌ద్దతు తెల‌ప‌డ‌మే కాదు.. బీజేపీ బ‌ద్ధ శ‌త్రువు కాంగ్రెస్‌తో వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్రధాన కార్యద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి క‌త్తి దూయ‌డం.. ఏపీ రాజ‌కీయాల్లోనే కాదు.. జాతీయ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. వ్య‌వ‌సాయ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో.. ఇది లోక్‌స‌భ‌లో సునాయాసంగా ఆమోదం పొందింది.

నమ్మకమైన పార్టీలు సయితం….

ఈ బిల్లు ఆమోదం విష‌యంలో ఎన్డీయే మిత్రప‌క్షాలు సైతం వ్యతిరేకించి చివ‌ర‌కు ప్రభుత్వం నుంచే వైదొల‌గి సంచ‌ల‌నం రేపాయి. శిరోమ‌ణి అకాళీద‌ల్ లాంటి న‌మ్మక‌మైన పార్టీలు సైతం కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రాగా.. మ‌రి కొన్ని మిత్రప‌క్ష పార్టీలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎటొచ్చీ.. రాజ్యస‌భ‌లో మాత్రమే ఇది ఆమోదం పొంద‌డం మోడీకి, ఆయ‌న పార్టీ నేత‌ల‌కు కూడా ప‌రీక్షగా మారింది. రాజ్యస‌భ‌లో బీజేపీకి త‌గిన బ‌లం లేక‌పోవ‌డం, కాంగ్రెస్ స‌హా ఇత‌ర ప‌క్షాలు ప్రధానంగా ఈ బిల్లుకు అడ్డుత‌గ‌ల‌డం వంటి కార‌ణాల‌తో మోడీ.. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదించుకునేందుకు ప్రయ‌త్నించారు.

వైసీపీ అండగా నిలిచి…..

ఈ క్రమంలోనే త‌మ‌కు మ‌ద్దతుగా నిలిచిన పార్టీల‌పై ఆయ‌న క‌న్నేశారు. ఈ క్రమంలో బిహార్‌లోని నితీశ్‌కుమార్‌, ఏపీలో జ‌గ‌న్ త‌ర‌ఫున ఎంపీలు మాత్రమే మోడీకి మ‌ద్దతుగా నిలిచారు. నిజానికి ఇలా మ‌ద్దతివ్వడం అనేది పెద్ద విష‌యం కాదు. కానీ, అంత‌కుమించి అనేధోర‌ణిలో.. వైసీపీ దూకుడుగా వ్యవ‌హ‌రించింది. రాజ్యస‌భ‌లో వైసీపీ నాయ‌కుడు విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ.. బిల్లును ఆమోదిస్తున్నామ‌ని ప్రక‌టించారు. అంత‌టితో ఆగిపోతే.. ఎలా అనుకున్నారో..ఏమో.. బీజేపీ నాయ‌కులు కూడా సాహ‌సించ‌ని రీతిలో.. కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు.

సాయిరెడ్డి దూకుడుతో…..

గ‌తంలో కాంగ్రెస్ తీసుకువ‌చ్చిన వ్యవ‌సాయ బిల్లుతో ద‌ళారులు పెరిగిపోయార‌న్న సాయిరెడ్డి.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపంగా ప‌రిణ‌మించింద‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో బీజేపీకి రాజ్యస‌భ‌లో మంచి ఊపొచ్చింది. ఈ క్రమంలో వైసీపీ ఊహించిన దానికంటే కూడా మోడీ ద‌గ్గర మంచి మార్కులు ప‌డ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామం భ‌విష్యత్తులో ఏపీ రాజ‌కీయాల్లో కూడా బీజేపీ – వైసీపీ చెలిమి లేదా ప‌ర‌స్పర స‌హ‌కారంకు బీజం వేసింద‌నే చెప్పాలి.

Tags:    

Similar News