ఎన్నికల వేళ డల్ అవుతున్న వైసీపీ

ఓ వైపు చావా రేవా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలు దూసుకువస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే చూడాలి. ఈసారి కనుక ఓటమి పాలు అయితే [more]

Update: 2019-02-10 11:00 GMT

ఓ వైపు చావా రేవా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలు దూసుకువస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగానే చూడాలి. ఈసారి కనుక ఓటమి పాలు అయితే పార్టీ మనుగడకే ప్రమాదం. అటువంటి చోట నిలిచి గెలవాలి. చివరి వరకూ పోరాడాలి. కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ తీరు చూస్తే మాత్రం ఆ ఉద్యమ స్పూరి పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అయిదేళ్ళు పాలించిన టీడీపీ మళ్ళీ ఈసారి ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ ఉరకలు వేస్తూంటే వైసీపీలో మాత్రం నైరాశ్యం నిండా కమ్ముకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను సైతం అధిగమించి పసుపు పార్టీ తమ్ముళ్ళు దూసుకుపోతూంటే గెలుపు మాదేనని చెప్పాల్సిన వైసీపీ దిగాలుపడుతోంది.

అభద్రతాభావమే :

వైసీపీలో అడుగడుగునా అభద్రతా భావం పట్టి పీడిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కూడా పెద్దగా పనిచేసే నాయకులు లేరు. దానికి తోడు గ్రూపుల గొడవలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీకి ఏక త్రాటిపై నడిపే నాయకత్వం లేకపోవడం పెద్ద లోటు. విశాఖ జిల్లాలో చూసుకుంటే గట్టి పేరున్న నాయకుడు ఒక్కరూ లేరు. ఉన్న నాయకులు కొణతాల రామక్రిష్ణ, దాడి వీరభద్రరావు, సబ్బం హరి లాంటి వారు పార్టీకి గుడ్ బై కొట్టేశారు. విజయన‌గరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నా ఆయన ప్రత్యర్ధి వర్గం కూడా గట్టిగా ఉంది. ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం వంటి వారు ఉన్నా పార్టీలో వర్గ పోరు కూడా అదే స్థాయిలో ఉంది. వీటికి తోడు ప్రతీ అసెంబ్లీ సీటు మీద నలుగురైదుగురు ఆశలు పెంచుకుని ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు. దాంతో అంతా అభద్రతాభావంతో ఉన్నారు. అధినేత ఎటూ తేల్చకపోవడం వల్ల కూడా పార్టీలో స్తబ్దత ఆవరించి ఉంది.

పండుగ చేసుకుంటున్నారుగా :

ఇక టీడీపీలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంక్షేమ పధకాల పుణ్యమాని పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. మల్లీ గెలిచేస్తామన్న ధీమా బాగా పెరిగింది. పార్టీకి పటిషమైన నాయకత్వం ఉండడం. అందరూ కూడా ప్రభుత్వ పరంగా లబ్ది పొదండం వల్ల మళ్ళీ టీడీపీని గెలిపించుకోవాలన్న ఆశ, కసి కార్యకర్తల్లో కనిపిస్తోంది. తాయిలాలతో పాటు, బీసీలకు కులానికో కార్పోరేషన్ ప్రకటించడం వంటి వాటి వల్ల బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి బాగా ప్లస్ అవుతూంది. దాంతో క్యాడర్ జనంలోకి వెళ్ళి తమ పార్టీ చేసిన పనులు, పధకాల గురించి బాగా చెబుతోంది. ఈ మొత్తం సీన్ చూస్తూంటే ఎన్నికలకు ముందే వైసీపీ డీలా పడిపోయిందా అనిపించక మానదు.

Tags:    

Similar News