ఫస్ట్ లిస్ట్ లో చోటు వీరికే… తేల్చేసిన జగన్…!!

పాద‌యాత్ర అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టిపెట్టారా? ముఖ్యంగా రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన కృష్ణా జిల్లాపై ఆయ‌న ఫుల్ ఫోక‌స్ పెట్టారా? అందుకే [more]

Update: 2019-01-23 19:00 GMT

పాద‌యాత్ర అనంత‌రం వైసీపీ అధినేత జ‌గ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టిపెట్టారా? ముఖ్యంగా రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన కృష్ణా జిల్లాపై ఆయ‌న ఫుల్ ఫోక‌స్ పెట్టారా? అందుకే 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేశారా? కొంద‌రికీ మొండిచేయి చూపుతూనే.. పార్టీని న‌మ్ముకుని ఉన్న వారికి న్యాయం చేశారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌రికొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారో ఏమో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. టీడీపీ కంచుకోట లాంటి కృష్ణా జిల్లాపైనే తొలుత దృష్టి సారించారు. అయితే ఉన్న ఎమ్మెల్యేల్లో కొంద‌రు పార్టీ మారతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. పార్టీ వర్గాలు వీటిని కొట్టిపారేస్తున్నారు. మ‌ళ్లీ వాళ్లే వైసీపీ నుంచి బ‌రిలోకి దిగుతార‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. కొన్ని సంచ‌ల‌నాలు, మ‌రికొన్ని ఊహించ‌ని ప‌రిణామాలు.. ఇలా పాత. కొత్త వారి క‌ల‌యిక‌తో జాబితా రెడీ చేశార‌ట.

వీరికే టిక్కెట్లు…..

ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు నెల‌లు మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ముందుగా ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రాజ‌కీయ చైత‌న్యం అధికంగా ఉన్న కృష్ణా జిల్లాలోని 16 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. దీని ప్ర‌కారం.. నందిగామ‌(ఎస్సీ)- మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు, పెడ‌న‌- జోగి ర‌మేష్‌, మ‌చిలీప‌ట్నం- పేర్ని నాని, నూజివీడు- మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు, పామ‌ర్రు(ఎస్సీ)- కైలా అనిల్ కుమార్‌, తిరువూరు(ఎస్టీ)- కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి, మైల‌వ‌రం- వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, జ‌గ్గ‌య్య‌పేట‌- సామినేని ఉద‌య‌భాను, విజ‌య‌వాడ‌(తూర్పు)- య‌ల‌మంచిలి ర‌వి, గుడివాడ‌- కొడాలి నాని, కైక‌లూరు- దూలం నాగేశ్వ‌ర‌రావు, గ‌న్న‌వ‌రం- యార్ల‌గ‌డ్డ‌ వెంక‌ట్రావు, అవ‌నిగ‌డ్డ‌- సింహాద్రి ర‌మేశ్‌, విజ‌య‌వాడ(ప‌శ్చిమ‌)- వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, విజ‌య‌వాడ‌(సెంట్ర‌ల్‌)- మ‌ల్లాది విష్ణు, పెన‌మలూరు- కొలుసు పార్థ‌సార‌ధి పోటీచేయ‌నున్నార‌ట‌.

ఎంపీ అభ్యర్థిపై….

ఇక మచిలీ ప‌ట్నం ఎంపీగా తెనాలి మాజీ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ఇక విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిపై ఇంకా క్లారిటీ రాలేద‌ట‌. అయితే ఇక్క‌డి నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని బ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. వీరిలో పామ‌ర్రు నుంచి గెలిచిన ఉప్పులేటి క‌ల్ప‌న‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి గెలిచిన జ‌లీల్ ఖాన్‌.. టీడీపీ కండువా క‌ప్పేసుకున్నారు. వీరి స్థానంలో కైలా అనిల్‌కుమార్, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌కు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. పార్టీని వీడిన ఎమ్మెల్యేల‌తో పాటు పార్టీలో కొన‌సాగుతున్న ఎమ్మెల్యేలు కొడాలి నాని(గుడివాడ‌), మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు(నూజివీడు), ర‌క్ష‌ణ నిధి(తిరువూరు)కి టికెట్ వారికే ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం తిరువూరు, నూజివీడు ఎమ్మెల్యేలు పార్టీ మారతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. వీటిని పార్టీ వ‌ర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

వారకి మళ్లీ ఛాన్స్….

గ‌త ఎన్నిక‌ల్లో నందిగామ‌, మ‌చిలీప‌ట్నం, జ‌గ్గ‌య్య‌పేట‌, అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు, పేర్నినాని, సామినేని ఉద‌య‌భాను, సింహాద్రి ర‌మేశ్‌ల‌కు మ‌ళ్లీ చాన్స్ ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక గ‌త ఎన్నికల్లో మైల‌వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి ర‌మేశ్‌ను ఈసారి పెడ‌నకు మారుస్తార‌ని స‌మాచారం. మ‌చిలీప‌ట్నం నుంచి పార్ల‌మెంటుకు పోటీచేసి ఓడిపోయిన కొలుసు పార్థ‌సార‌ధిని పెన‌మ‌లూరు టికెట్ ఇచ్చారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలోనూ జగన్ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖారారు చేయనున్నారు.

Tags:    

Similar News