జగన్ టార్గెట్ అదేనా …?

ప్రభుత్వాలు మారినప్పుడు పాత సర్కార్ లో వున్న కొన్ని మంచి కార్యక్రమాలను పేర్లు మార్చేసి ప్రకటించడం రివాజు. ఎన్టీఆర్ నుంచి వైఎస్సాఆర్ వరకు అలా చేసిన వారే. [more]

Update: 2019-07-12 09:30 GMT

ప్రభుత్వాలు మారినప్పుడు పాత సర్కార్ లో వున్న కొన్ని మంచి కార్యక్రమాలను పేర్లు మార్చేసి ప్రకటించడం రివాజు. ఎన్టీఆర్ నుంచి వైఎస్సాఆర్ వరకు అలా చేసిన వారే. అయితే ఈ విధానానికి భిన్నంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక వ్యవహరిస్తూ వస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో వుండే అన్న క్యాంటిన్ ఇప్పుడు మూసేసారు. రాష్ట్రంలో త్వరలో మిగిలిన అన్న క్యాంటిన్ లు కొనసాగిస్తారా లేదో స్పష్టత లేదు. వైఎస్ మొదలు పెట్టిన పింఛన్ లు, ఆరోగ్యశ్రీ, వంటివాటికైతే జగన్ సర్కార్ పేర్లు మార్చేసింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని వైఎస్సాఆర్ రైతు భరోసా చేసింది. ఇంకా ఇలా అనేకం పేర్లు మార్చుకుని సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తుంది.

పాతవన్నీ తవ్వి తీస్తున్న ప్రభుత్వం ….

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గతం గతః గా పాత విషయాల జోలికి పోయేవారు కాదు. కానీ ఎన్నికల ముందు మాత్రం విపక్షం అధికార పక్షం పై చేయని విమర్శలు ఆరోపణలు ఉండేవి కాదు. అంత స్థాయిలో దూషణ భూషణలు నడిచినా విపక్షం నుంచి అధికారపక్షానికి మారాక తమ పనేదో తాము చేసుకుంటూ సాగేవారు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. గతంలో జరిగిన పనులు, తీసుకున్న నిర్ణయాలు తవ్వి తీసేందుకు ఏకంగా క్యాబినెట్ సబ్ కమిటీనే ముఖ్యమంత్రి ప్రకటించి పని మొదలు పెట్టారు. 45 రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్నింటిపై విచారణ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇలా చేయడం ఒకందుకు మంచిదే అయినా జగన్ కక్షసాధింపు ధోరణిలో సాగుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.

మధ్యలో అధికారులు బలవుతారా …?

ఇటు అధికారపక్షం, అటు విపక్షం ఈ వ్యవహారంలో బాగానే వుంటారు. కానీ గత సర్కార్ హయాంలో నిర్ణయాలు అమలు చేసిన అధికారులు బలిపశువులుగా మారుతారన్న ఆందోళన అధికారిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అయితే జగన్ భవిష్యత్తులో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎలా స్పందిస్తారన్న అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

Tags:    

Similar News