గల్లాకు ఇబ్బందులు తప్పవా…?

తాజా ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది అచ్చంగా 23 ఎమ్మెల్యేలు, మూడంటే మూడు ఎంపీ సీట్లు మాత్రమే. అయితే అవి కూడా ఆ పార్టీకి కొసవరకూ ఉంటాయా అన్న [more]

Update: 2019-07-10 12:30 GMT

తాజా ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది అచ్చంగా 23 ఎమ్మెల్యేలు, మూడంటే మూడు ఎంపీ సీట్లు మాత్రమే. అయితే అవి కూడా ఆ పార్టీకి కొసవరకూ ఉంటాయా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఓ వైపు టీడీపీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం మొదలెట్టింది. గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలను బుట్టలే వేసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. మరి ఎందరు పడతోరో, ఎందరు ఉంటారో తమ్ముళ్లకు అదో టెన్షన్ గా ఉంది. ఇక దీనికి తోడు అన్నట్లుగా వైసీపీ మరో విధంగా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల పై వైసీపీ ఇపుడు న్యాయ పోరాటానికి రెడీ అయిపోయింది. కోర్టు ద్వారా వ్యవహారం చక్కబెట్టాలనుకుంటోంది. గుంటూరు ఎంపీ, పెద్దాపురం, చీరాల ఎమ్మెల్యేలపై వైసీపీ కోర్టుకు ఎక్కింది

పోస్టల్ ఓట్లు లెక్కబెట్టాలిట….

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కేవలం నాలుగున్నర వేల ఓట్ల తేడాతో వైసీసెపీ ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి మీద గెలిచాడు. అయితే ఇక్కడ తొమ్మిదిన్నర వేల పై చిలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కబెట్టకుండా వదిలేశారు. కొన్ని సాంకేతిక కారణాలు చూపిస్తూ వాటిని కౌంట్ చేయలేదు. దీంతో వేణుగోపాలరెడ్డి అపుడే న్యాయపోరాటం చేస్తానని గట్టిగా చెప్పారు. ఇపుడు తమ ఓట్లు లెక్కించాల‌ని ప్రభుత్వ ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. వారి వెనక వైసీపీ ఉందని అంటున్నారు. కోర్టు కనుక మొత్తం పోస్టల్ ఓట్లు లెక్కబెట్టాలని ఆదేశిస్తే మాత్రం గల్లా ఓటమి పాలు అవుతారని వైసీపీ నేతలు అంతున్నారు.

చినరాజప్ప మీద కూడా….

ఇక పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీద కూడా ఓడిన వైసీపీ అభ్యర్ధి తోట వాణి కోర్టుకు వెళ్లారు. ఆయన తప్పుడు అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ కి ఇచ్చి తప్పుదోవ పట్టించారని వాణి ఆరోపించారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద ఓడిన వైసీపీ అభ్యర్ధి ఆమంచి అక్రిష్ణ మోహన్ కోర్టుకెక్కారు. ఆయన తమ కుటుంబ వివరాలు పూర్తిగా చెప్పలేదని, ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉంటే ఎన్నికల సంఘాన్ని తప్పు తోవ పట్టించారని క్రిష్ణ మోహన్ న్యాయ స్థానాఅన్ని ఆశ్రయించారు. మరి కరణం రెండవ పెళ్ళి భాగోతాన్ని బయటకు తీసారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా సమర్పించారు. కోర్టు కనుక అనర్హత వేటు వేస్తే బలరాం ఎమ్మెల్యే గిరీ పోయినట్లే. చూడాలి సైకిల్ పార్టీ తమ్ముళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో.

Tags:    

Similar News