జగన్ ఇలా చేస్తే అంతేనా?

జగన్ ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో జీరో రిజల్ట్ తప్పదా? పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ వ్యవహారం అంతుచిక్కడం లేదా? వైఎస్ జగన్ కోసం తొమ్మిదేళ్ల [more]

Update: 2019-07-19 12:30 GMT

జగన్ ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో జీరో రిజల్ట్ తప్పదా? పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ వ్యవహారం అంతుచిక్కడం లేదా? వైఎస్ జగన్ కోసం తొమ్మిదేళ్ల నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడి వరకూ పార్టీ జెండా పట్టుకుని అప్పటి అధికార పార్టీపై పోరాడారు. ఎన్నో కేసులు పెట్టినా భరించారు. సొంత డబ్బులు వెచ్చించి పార్టీ కోసం కష్టపడిన తమకు జగన్ సర్కార్ రావడంతో తమ కష్టాలు తీరతాయని భావించారు. అయితే రోజురోజుకూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తమకు నచ్చడంలేదంటన్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.

చిన్న చిన్న కాంట్రాక్టులు….

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే యాభై రోజులు గడిచింది. తమ ప్రభుత్వం వచ్చిందని, తమ కష్టాలు తీరతాయని అనే మంది నేతలు, కార్యకర్తలు భావించారు. చిన్న చిన్న కాంట్రాక్టులను దక్కించుకోవచ్చని, ఆర్థికంగా గట్టెక్కవచ్చని ఊహించుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా తమ జేబుల్లో డబ్బు ను ఖర్చు చేశారు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమకు ఎటువంటి లబ్ది చేకూరదని దాదాపుగా అర్థమయింది.

నామినేషన్ పదవులు….

చిన్న చిన్న కాంట్రాక్టు పనులు, నామినేషన్ పనుల్లోనూ జగన్ బీసీలకే యాభై శాతం పైన కేటాయించాలని తీసుకున్న నిర్ణయం కూడా పార్టీ నేతల్లో అసంతృప్తికి కారణమయింది. నామినేషన్ పనులను తాము తీసుకోవాలని భావించిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు ఇది కంటగింపుగా మారింది. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ తమకు అవకాశం దక్కేది కష్టమేనని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో క్యాడర్ లో అసంతృప్తి బయలుదేరిందని చెబుతున్నారు.

మద్యం షాపులు సయితం…

తాజాగా మద్యం షాపులపై కూడా అనేక మంది కన్నేశారు. మేనిఫేస్టోలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించినా వైసీపీ ద్వితీయ శ్రేణినేతలు ఈ షాపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మద్యం షాపు ద్వారా భారీగా లబ్ది పొందవచ్చని భావించారు. కానీ జగన్ మాత్రం మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో దిగులు పట్టుకుంది. ఇలా తమకు ఆర్థికంగా అంది వచ్చే అవకాశాలన్నింటినీ జగన్ స్వయంగా దెబ్బకొడుతుండటంతో తీవ్ర అసంతృప్తి క్యాడర్ లో నెలకొంది. మరి జగన్ చెవికి ఈ అసంతృప్త నినాదాలు చేరతాయా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News