ఎన్డీయేలో చేరితేనే బెటరేమో?

విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ అష్టకష్టాలు పడుతోంది. మరో వైపు రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరం నిధులు పెద్దగా విదల్చడంలేదు. కోరుకోని విభజనతో నష్టపోయిన ఏపీని ప్రత్యేకంగా [more]

Update: 2019-12-03 11:00 GMT

విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ అష్టకష్టాలు పడుతోంది. మరో వైపు రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరం నిధులు పెద్దగా విదల్చడంలేదు. కోరుకోని విభజనతో నష్టపోయిన ఏపీని ప్రత్యేకంగా ఆదుకునేందుకు కేంద్రం పెద్దగా దృష్టి సారిస్తున్నట్లుగా లేదు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీని చూస్తోంది. ఇక మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధుల పంపిణీ కూడా అనుకున్నట్లుగా లేదన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్రులు ఉన్న రాష్ట్రాలకు దండిగా నిధులు కేటాయించి మిగిలిన వాటిని పంచామన్నట్లుగా ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ పరిణామం ఏపీ వంటి రాష్ట్రాలకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. పొరుగున ఉన్న తెలంగాణా స్వయం సమ్రుధ్ధిని ఆర్ధికంగా కలిగి ఉంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా కొత్త ఇబ్బందులు లేవు. కానీ మొదటి నుంచి నిర్మించుకుని రావాల్సిన ఏపీకి మాత్రం ఇది తీరని అన్యాయంగానే ఉంది.

ప్రభుత్వంలో చేరితే…?

ఇక ఏపీలో బీజేపీకి ఎంపీలూ లేరు, కేంద్ర క్యాబినేట్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యమూ లేదు. ఆరు నెలల పాలనా అక్కడా ఇక్కడా కూడా జరిగింది. హనీమూన్లు ఇక‌ ముగిసాయి. ఏపీలో అయితే రాజకీయ యుధ్ధం ఎపుడో మొదలైపోయింది. ఈ నేపధ్యంలో ఏపీకి జగన్ సారధ్యంలో కేంద్రం నుంచి పెద్దగా నిధులు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జగన్ సైతం తేలేకపోతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. కేంద్రం సైతం ఏపీలో విపక్ష వైసీపీ ఉంది మనకెందుకు అన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడే జగన్ కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేధావులు సహా అంతా సూచిస్తున్నారు. కేంద్రంలో శివసేన పక్కకు తప్పుకుంది. అక్కడ క్యాబినెట్ బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి. అదీ కాకుండా ఏపీ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు. దాంతో వైసీపీ కనుక రాజకీయ విభేదాలు, సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి ఎన్డీయేలో చేరితే రాష్ట్రానికి ఉపయోగమని అంతా అంటున్నారు.

వ్యూహాత్మకమైన అడుగే…..

వైసీపీకి 22 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరు కనుక కేంద్ర ప్రభుత్వంలో చేరితే కేంద్రానికి వచ్చే లాభం పక్కన పెడితే ఏపీకి గణనీయమైన ప్రయోజనం సమకూరుతుందని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. కనీసంగా ఇద్దరికైనా కేంద్ర క్యాబినేట్లో మంత్రి పదవులు దక్కుతాయి. కీలకమైన శాఖలు కోరినా ఏపీకి ఆ పరంగా ప్రత్యక్షంగా మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రిగా జగన్ తేన కేంద్ర మంత్రుల ద్వారానే నిధులు సాధించుకోవచ్చు, కేంద్ర మంత్రి మండలిలో ఏపీ వాదన, గొంతుక బలంగా వినిపిస్తాయి. ఏపీ ఆర్ధికంగా కూడా ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంది. బీజేపీకి కూడా ఏపీ తమ మిత్ర రాష్ట్రమని చెప్పుకోవడానికి వీలవుతుంది.

అలా దెబ్బ కొట్టొచ్చు…..

మరో వైపు వైసీపీకి కూడా కేంద్రంతో దూరం తగ్గుతుంది. బయట ఉండడం వల్ల ప్రతిపక్ష ఎంపీలు 22 మంది ఉన్నా కూడా వృధాయే అన్న భావన వ్యక్తమవుతోంది. అదే విధంగా కేంద్రంతో ఎడాన్ని పెంచుతూ రాజకీయంగా టీడీపీ, జనసేన ఎత్తుగడలు వేస్తూండడం కూడా వైసీపీకి ఇబ్బందిగా ఉంటోంది. ఏపీ బీజేపీ నేతల నుంచి కూడా విమర్శలు తప్ప సహకారం లేకుండా పోతోంది. ఈ పరిణామాలు అన్నీ కూడా విశ్లెషించుకున్నపుడు కేంద్ర సర్కార్ లో వైసీపీ చేరడం మంచిదనే అంతా అంటున్నారు. దీని వల్ల రాజకీయంగా కూడాజగన్ బలంగా ఉంటారని, కేంద్రం అండ దక్కుతుందని కూడా చెబుతున్నారు. మరి వైసీపీ వూహకర్తలు దీని మీద సీరియస్ గా ఆలోచన చేస్తారా.

Tags:    

Similar News