అన్నయ్యను లాగేస్తారా?

రాజకీయాల్లోకి దిగాక వారూ వీరూ ఉండరు. బంధాలు, అనుబంధాలకూ అక్కడ తావుండదు. దేశంలో ఎన్నో కుటుంబాలు రాజకీయాలలో వేరు పార్టీలో ఉంటున్న సంగతి కొత్తేమీ కాదు. ఇక [more]

Update: 2020-01-26 06:30 GMT

రాజకీయాల్లోకి దిగాక వారూ వీరూ ఉండరు. బంధాలు, అనుబంధాలకూ అక్కడ తావుండదు. దేశంలో ఎన్నో కుటుంబాలు రాజకీయాలలో వేరు పార్టీలో ఉంటున్న సంగతి కొత్తేమీ కాదు. ఇక తెలుగు రాజకీయాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ, రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ తనదైన రాజకీయ పంధా అంటూ జనసేన పెట్టారు. ఇక ఆయన ఎప్పటికపుడు మిత్రులను మారుస్తూ తనదైన రాజకీయం చేస్తున్నారు. రాజకీయాల్లో చిరంజీవి వల్ల కానిది తాను చేసి చూపిద్దామని పవన్ కల్యాణ్ ఆరాటం. అయితే ఇప్పటికీ కూడా చిరంజీవి పాలిటిక్స్ ముందు పవన్ తక్కువేనని నిన్నటి ఎన్నికల ఓటమే తేల్చిచెప్పింది. ఇక పవన్ కల్యాణ్ ఇపుడు జగన్ ని ఢీ కొట్టేందుకు బీజేపీ అండ కోరుకున్నారు. మరి చిరంజీవిని కూడా ముగ్గులోకి లాగేందుకు తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయట.

వైసీపీ ద్వారా….

చిరంజీవి విషయంలో జగన్ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. ఆయన సైరా సినిమా చూడాలంటూ తనను కలసిన సందర్భంలో ఇంటి వద్ద ఎదురేగి స్వాగతం పలికిన జగన్ ఆయనతో కలసి విందు కూడా చేశారు. ఇక చిరంజీవికి ఎనలేని గౌరవం ఇస్తున్న జగన్ ఆయన్ని మళ్ళీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారుట. మెగాస్టార్ ని వైసీపీ ద్వారా రాజకీయ తెరపైకి తెచ్చేందుకు కూడా జగన్ చురుకుగా పావులు కదుపుతున్నట్లుగా న్యూస్ వస్తోంది.

మళ్ళీ రాజ్యసభకు…

ఈ ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చిరంజీవిని ఎంపిక చేయాలని జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. చిరంజీవి మూడు రాజధానుల ప్రకటనను సమర్ధించడం, జగన్ పాలనపై ఆయన పలుమార్లు ప్రశంసలు కురిపించడం వంటిని ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని బాగా పెంచాయని అంటున్నారు. ఇక త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో నాలుగు ఎంపీ సీట్లూ వైసీపీ గెలుచుకుంటుంది. అందులో ఒకటి చిరంజీవికి ఇస్తే కాపు కోటా కూడా భర్తీ అవుతుందని, చిరంజీవి వంటి మెగాస్టార్ అండ కూడా తమకు దొరుకుతుందని జగన్ గొప్ప వ్యూహన్ని రెడీ చేశారని అంటున్నారు.

పవన్ కి చెక్….

బీజేపీతో పొత్తు పెట్టుకుని తనను సవాల్ చేసిన పవన్ కి సరైన జవాబు చిరంజీవి ద్వారానే ఇప్పించాలని జగన్ ఆలోచన చేస్తున్నారుట. చిరంజీవి సైతం రాజ్యసభ సీటుని కోరుకుంటున్నారని అంటున్నారు. చిరంజీవి కనుక వైసీపీ ద్వారా ఎంపీ అయితే కోస్తా జిల్లాల్లో కాపులు వైసీపీతోనే ఉంటారని అంటున్నారు. అదే విధంగా పవన్ని పక్కన పెట్టుకున్న బీజేపీ పాచికలు కూడా పారకుండా ఈ ఎత్తుగడ ఉపయోగపడుతుందని వైసీపీ శిబిరం ఆలోచిస్తోందట. మొత్తానికి అనుకున్నట్లుగా జరిగే మాత్రం అన్నదమ్ముల సవాల్ కి ఏపీ వేదికగా మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News