మేకపాటి ఇలాగే మెయిన్ టెయిన్ చేస్తే?

ఎన్నికల సమయంలో టిక్కెట్ తనకే కావాలంటూ పోటీ పడిన నాయకులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు [more]

Update: 2020-01-18 11:00 GMT

ఎన్నికల సమయంలో టిక్కెట్ తనకే కావాలంటూ పోటీ పడిన నాయకులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గంలో కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించడమే. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. నాయకత్వం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలను మేకపాటి గౌతమ్ రెడ్డి తన పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఫలితంగా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారయింది.

దశాబ్దకాలంగా….

ఆత్మకూరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ తరుపున ఆనం రామనారాయణరెడ్డి అక్కడి నుంచి ఒకసారి విజయం సాధించారు. తర్వాత ఇక వైసీపీ వంతు వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి వరస గెలుపులతో హోరెత్తించారు. అయితే ఇక్కడ టీడీపీ పరిస్థితి అంత బాగాలేదు. 1999లో మత్రమే టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. అంటే దశాబ్దకాలంగా ఆత్మకూరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు.

ఎవరికీ పూర్తిస్థాయి…..

టీడీపీ ఇక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కన్నబాబు అక్కడి కార్యకర్తలకు అండగా నిలిచారు. తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి వెళ్లిన తర్వాత తిరిగి కన్నబాబు పార్టీకి దిక్కయ్యారు. కొంతకాలం తర్వాత మళ్లీ ఆత్మకూరు బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. ఆదాల కూడా ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లడంతో మాజీ జడ్పీఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడులకు అప్పగించారు. చివరకు ఎన్నికలకు ముందు టిక్కెట్ మాత్రం బొల్లినేని కృష్ణయ్యకు ఇవ్వడంతో పార్టీకి పూర్తిస్థాయిలో ఇన్ ఛార్జి ఎవరూ లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ద్వితీయ శ్రేణి నేతలు….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మకూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జి పదవిని ఎవరికీ అప్పగించలేదు. గత ఎన్నికల్లో పోట ీచేసి ఓటమి పాలయిన బొల్లినేని కృష్ణయ్య సయతం ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఇన్నిసార్లు తనకు హ్యాండ్ ఇవ్వడంతో కన్నబాబుకూడా సైలెంట్ అయ్యారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీడీపీని అక్కడ ఖాళీ చేయాలన్న ఉద్దేశ్యంంతో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీలోని అనేక మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణనేతలు ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. మొత్తం మీద ఆత్మకూరు నియోజకవర్గంలో నేతలను తరచూ మారస్తుండటం వల్లనే సరైన నాయకత్వం లోపించిందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News