ప‌శ్చిమ వైసీపీ సీనియ‌ర్ల గ‌గ్గోలు… రీజన్ ఇదే ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో 13 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఉన్న [more]

Update: 2021-06-11 03:30 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో 13 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే పేరుకు మాత్రమే వీరంతా వైసీపీ సీనియ‌ర్లు, హీరోలు.. ఇటు చేత‌ల్లోనూ, అటు ప్రజ‌ల దృష్టిలోనూ, చివ‌ర‌కు అధిష్టానం వ‌ద్ద వీరో జీరోలేనా ? అన్న సందేహాలు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది సీనియ‌ర్లతో పాటు కొత్త వాళ్లు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారంతా త‌మ నియోజ‌క‌వర్గానికి ఏదో ఒక కీల‌క ప్రాజెక్టు ద‌క్కించుకోవ‌డ‌మో లేదా త‌మ‌కో త‌మ అనుచ‌రుల‌కో రాష్ట్ర స్థాయిలో పార్టీ లేదా నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డంలోనో స‌క్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు వైసీపీ సీనియ‌ర్లు నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటున్నా వీరు గోడు ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ట‌.

కొట్టు సత్యనారాయణకు…?

తాడేప‌ల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు స‌త్యనారాయ‌ణ‌ది 35 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం. 1994లోనే ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇంత సీనియ‌ర్ అయినా, గూడెం నియోజ‌క‌వ‌ర్గం జిల్లాలో కీల‌క పాయింట్ అయినా ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి, ప్రాధాన్యత లేదు. చివ‌ర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న నిట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల‌కు కూడా ఈ ప్రభుత్వంలో ఒరిగింది లేదు. పోల‌వ‌రంలో నాలుగోసారి గెలిచిన బాల‌రాజు, గ‌తంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ఇప్పట‌కి ఏ ప‌ద‌వి లేదు. ఆయ‌న సాధించుకున్న ప్రాజెక్టు లేదు. బాల‌రాజు తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నట్టు టాక్ ? పైగా ప్రక్షాళ‌న‌లో అయినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేద‌ట‌.

సీనియర్ అయినా?

న‌ర‌సాపురంలో ముదునూరి ప్రసాద‌రాజు వైసీపీ లో సీనియ‌ర్‌… పైగా జ‌గ‌న్ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వదులుకుని మ‌రీ ఉప ఎన్నిక‌ల్లో ఓడారు. ఆయ‌న‌కు ఇప్పటికి అయితే ఎలాంటి ప్రాధాన్యం లేదు. అందుకే త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ర‌ఘురామ విష‌యంలో సైలెంట్ అయ్యార‌ని చ‌ర్చ. ఇక త‌ణుకులో గెలిచిన కారుమూరిది కూడా 20 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీయే. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన కారుమూరి ఏదైనా ప‌ద‌వి వ‌స్తే చాల‌నుకుంటున్నా ఆయ‌న గోడు ప‌ట్టించుకునే వాళ్లే లేరు. పైగా తొలి యేడాదిలోనే ఆయ‌న సీఎం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఇక వ‌దిలేశార‌ట‌.

పదవులు… నిధులు లేక..?

జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న తానేటి వ‌నిత‌, ఆళ్ల నాని, రంగ‌నాథ‌రాజుల‌లో రంగ‌నాథ రాజు, ఆళ్ల నానిది కూడా 30 + పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ ప్రస్థాన‌మే. వీళ్లకు కాలం క‌లిసొచ్చి మంత్రులు అయ్యారు. వ‌నిత ల‌క్‌గా మంత్రి అయ్యారు. మిగిలిన సీనియ‌ర్లు మాత్రం ఆశ‌లు ఆకాశంలో పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. అదే టీడీపీ ప్రభుత్వంలో అయితే పీత‌ల సుజాత‌, జ‌వ‌హ‌ర్‌, పితాని స‌త్యనారాయ‌ణ‌, గూడెంలో బీజేపీ నుంచి మాణిక్యాల‌రావు మంత్రులు అయ్యారు. దెందులూరులో ప్రభాక‌ర్ విప్‌గా ఉన్నారు. ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే మొడియంకు ప్రాధాన్యత ద‌క్కింది. అటు రామానాయుడు కూడా అనేక క‌మిటీల్లో ఉండ‌డంతో పాటు పాల‌కొల్లుకు ఎన్నో ప్రాజెక్టులు కొల్లగొట్టుకుపోయారు. కానీ ఇప్పుడు వైసీపీలో చెప్పుకునేందుకు ప‌ద‌వులు లేవు… అటు నిధులు లేవు.

Tags:    

Similar News