డమ్మీలుగానే ఉంచుతారా?

ఔను! అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం ఈ విష‌యంపైనే చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన నాయ‌కుల‌కు ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. జ‌గ‌న్ సీఎం అవ్వాల‌ని, [more]

Update: 2020-01-19 02:00 GMT

ఔను! అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం ఈ విష‌యంపైనే చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన నాయ‌కుల‌కు ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. జ‌గ‌న్ సీఎం అవ్వాల‌ని, వైసీపీ అధికారం లోకి రావాల‌ని భారీ ఎత్తున ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు, అందుకోసం తీవ్రంగా శ్రమించిన నాయ‌కులు ప్రతి జిల్లాలోనూ ఉన్నారు. కుల మ‌తాల‌కు అతీతంగా జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నారు. జ‌గ‌న్ కోసం ప‌రిశ్రమించా రు. గ‌త ప్రభుత్వం నుంచి అనేక కేసులు, అవ‌మానాలు ఎదుర్కొన్నారు. అనుకున్నది సాధించారు. దీంతో త‌మ నాయ‌కుడు సీఎం అయ్యాడు కాబ‌ట్టి త‌మ‌కు కూడా రేంజ్ పెరుగుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

వీరందరూ వారే….

వీరిలో కాపు రామ‌చంద్రారెడ్డి, జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, అనంత వెంక‌ట్రామిరెడ్డి, మోపురుగుండు తిప్పేస్వామి, చింత‌ల రామ‌చంద్రారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, చిర్ల జ‌గ్గిరెడ్డి, మ‌హ‌మ్మద్ ముస్తాఫా, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, రాచ‌మల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి, కొక్కిలిగ‌డ్డ ర‌క్షణ‌నిధి, జోగి ర‌మేష్‌, సామినేని ఉద‌య‌భాను, ప్రస‌న్నకుమార్‌రెడ్డి, కాకాని గోవ‌ర్దన్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి (ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరినా ఈయ‌న కూడా ప‌ద‌విని ఆశిస్తున్నారు), రెడ్డి శాంతి, విశ్వసరాయి క‌ళావ‌తి, ధ‌ర్మాన ప్రసాద‌రావు, గొల్ల బాబూరావు, పీడిక రాజ‌న్నదొర‌, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి, తెల్లంబాల‌రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

రెండేళ్ల వరకూ….

వీళ్లంతా వైసీపీలో సీనియ‌ర్ నేత‌లు. వీరిలో కొంద‌రు వ‌రుస‌గా రెండుసార్లు.. కొంద‌రు మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన వారు కూడా ఉన్నారు. అటు పార్టీలో కానీ, ఇటు నామినేటెడ్ ప‌ద‌వుల్లోకానీ, లేదా ప్రభుత్వంలో కీల‌క స్థానాల‌ను కానీ వీరు ఆశిస్తున్నారు. వీరిలో చాలా మంది పార్టీ కోసం, జ‌గ‌న్ కోసం శ్రమించిన వారు ఉండ‌డంతో వీరి ఆశ‌ల‌కు అర్ధం ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే, ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన నియామ‌కాల్లో వీరికి ప్రాధాన్యం ల‌భించ‌క‌పోవ‌డం, మ‌రో రెండేళ్ల వ‌ర‌కు మంత్రి వ‌ర్గం పున‌ర్వ్యస్థీక‌ర‌ణ లేక‌పోవ‌డం, నామినేటెడ్ పోస్టులు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు ముడిపెట్టడం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వీరికి ఎలాంటి ప‌ద‌వులూ ల‌భించ‌లేదు. పైగా వీరిత‌ర్వాత పార్టీలోకి వ‌చ్చిన చాలా మంది ప‌ద‌వులు కైవ‌సం చేసుకున్నారు. దీంతో వీరంతా డ‌మ్మీలేనా? అనే భావ‌న అనుచ‌ర‌గ‌ణంలో పెరిగిపోతుండ‌డంతో వీరంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News