జగన్ వైసీపీని రీ లాంచ్ చేస్తారా ?

వైసీపీ ఏపీలో విజయ పతాక ఎగురవేస్తోంది. అతి బలమైన పార్టీగా ఉంది. సమీప భవిష్యత్తులో మరో పార్టీ కళ్ళు పెట్టి చూసేందుకు కూడా సిధ్ధంగా లేనంతగా వైసీపీ [more]

Update: 2020-07-16 12:30 GMT

వైసీపీ ఏపీలో విజయ పతాక ఎగురవేస్తోంది. అతి బలమైన పార్టీగా ఉంది. సమీప భవిష్యత్తులో మరో పార్టీ కళ్ళు పెట్టి చూసేందుకు కూడా సిధ్ధంగా లేనంతగా వైసీపీ గట్టిపడింది. దానికి తోడు అన్నట్లుగా జగన్ సైతం సంక్షేమ మంత్రంతో దూసుకుపోతున్నారు. అడిగిన వాడిదే పాపం అన్న తీరున వరాలు ఇస్తూ పాలన చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు వైసీపీ దూకుడు, జగన్ పాపులారిటీ జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. దాంతో పొరుగున ఉన్న తెలంగాణాలోనూ ఇదే చర్చగా ఉంది. జగన్ మీద ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మెత్తబడి మాట్లాడుతున్నారు. జగన్ బాగా పాలన చేస్తున్నాడు అని కితాబులు ఇస్తున్నారు.

మెచ్చుకోలు వెనక ….

జగన్ ని మెచ్చుకోవడం మొదట పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తం కుమార్ రెడ్డి మొదలుపెట్టారు. ఆ తరువాత నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకున్నారు. ఇదే వరసలో మరింతమంది తయారయ్యారు. వారంతా కూడా జగన్ ఏపీ సీఎంగా గ్రేట్ అంటున్నారు. జగన్ పేదలకు పధకాలు ఇవ్వడమే కాదు, కరోనా వేళ చాలా బాగా పనిచేస్తున్నారని కూడా అంటున్నారు. ఇంతకీ జగన్ ని ఇన్ని విధాలుగా పొగడడం వెనక రీజనేంటి అంటే జగన్ గుడ్ లుక్స్ లో పడడం కోసమేనట. మరి రాజకీయమంటే అలానే ఉంటుంది. పదేళ్ళు వెనక్కు వెళ్తే జగన్ ని నాడు కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అంతా తిట్టిన వారే.

లోటు తెలిసిందా …?

కాంగ్రెస్ కి జనాకర్షణ కలిగిన నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేడు. తెలంగాణాలో అయితే కొంతమంది ఎమ్మెల్యేలు, , ఎంపీలతో పార్టీ పటిష్టంగా కనీపిస్తున్నా దాన్ని ముందుకు తీసుకుపోయే లీడర్ షిప్ లేదు. పైగా కేసీయార్ లాంటి జనాదరణ కలిగిన నేతను ఢీ కొట్టడం అంటే మాటలు కాదు. అందువల్లనే టీ కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ స్మరణంతో పాటు జగన్ ని కూడా గుర్తు చేస్తుకుంటున్నారు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో సామాజికవర్గం పరంగా చూస్తే రెడ్లు డామినేటింగ్ రోల్ ప్లే చేస్తారు. వారికి అధికారం ఇపుడు అందని పండుగా మారింది. రాజకీయంగా ఆరేళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వారంతా ఏపీ రెడ్డి నాయకుడు జగన్ వైపు చూస్తున్నారు అని తెలుస్తోంది.

ఎలా జరిగినా….?

ఇక టీ కాంగ్రెస్ నాయకులకు వారి పార్టీ పెద్దల మీద ఎటువంటి ఆశలూ లేవు. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ ఇపుడు ఇబ్బందుల్లో ఉంది. దాంతో తెలంగాణాలో మళ్ళీ పవర్లోకి రాకపోతే ఈసారి కాంగ్రెస్ అక్కడ భూస్థాపితమే అవుతుందన్న భయం కూడా ఉంది దీంతో జగన్ ని మంచి చేసుకుని రెడ్లు తెలంగాణాకు ఆయన్ని ఆహ్వానిస్తున్నట్లుగా సీన్ కనిపిస్తోంది. వీలు అయితే వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయట. అయితే ఇది లోకల్ గా తీసుకునే నిర్ణయం కాదు, జాతీయ స్థాయిలో జరిగేది. కాంగ్రెస్ హై కమాండ్ సరేనన్నా కూడా జగన్ దానికి ఒప్పుకోరు. దాంతో రెండవ ఆప్షన్ ఏంటి అంటే తెలంగాణాలో వైసీపీని రీ లాంచ్ చేయడం. 2014 తరువాత అక్కడ వైసీపీ ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. ఇపుడు కనుక పార్టీని యాక్టివేట్ చేసే కాంగ్రెస్ నాయకులే చేరేందుకు పెద్ద ఎత్తున రెడీగా ఉన్నారని వినిపిస్తోంది. మరి జగన్ ఆ దిశగా ఆలోచన చేస్తారా. కేసీయార్ తో డైరెక్ట్ పోరుకు సిధ్ధపడతారా. చూడాలి మరి.

Tags:    

Similar News