టీడీపీకి నాలుగేళ్లు ప‌డితే.. వైసీపీ ఏడాదిన్నర‌లోనే?

ఔను! రాజ‌కీయ విశ్లేష‌కులు ఇప్పుడు ఇదే టాపిక్ చెబుతున్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న టీడీపీ క‌న్నా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ చాలా ఫాస్ట్‌గా ఉంద‌ని అంటున్నారు. [more]

Update: 2020-12-01 03:30 GMT

ఔను! రాజ‌కీయ విశ్లేష‌కులు ఇప్పుడు ఇదే టాపిక్ చెబుతున్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న టీడీపీ క‌న్నా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ చాలా ఫాస్ట్‌గా ఉంద‌ని అంటున్నారు. అందుకే ఆ విష‌యంలో టీడీపీకి దాదాపు మూడున్నరేళ్లకుపైగా స‌మ‌యం ప‌ట్టింద‌ని.. కానీ, వైసీపీ మాత్రం యేడాదిన్నర‌లోనే ఈ రికార్డును సొంతం చేసుకుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇంత‌కీ ఆ రికార్డు ఏంటి ? విష‌యం ఏంటి ? అనేగా సందేహాలు.. చూద్దాం.. అధికార పార్టీపైనా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌పైనా.. ప్రజ‌ల్లో వ్యతిరేక‌త రావ‌డం స‌హ‌జం. ఎన్నిక‌ల‌కు ముందు చెప్పేదొక‌టి.. త‌ర్వాత చేసేది మ‌రొక‌టి దీనికి కార‌ణం.

టీడీపీ రికార్డును…..

దీంతో స‌హ‌జంగానే ప్రజ‌ల్లో కొంత మేర‌కు వ్యతిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంటుంది. అయితే.. దీనిని త‌గ్గించుకునే ప్రయ‌త్నాలు అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ చేస్తుంది. గ‌తంలో టీడీపీ స‌ర్కారు కూడా త‌న అనుభ‌వంతో ప్రజా వ్యతిరేక‌త‌ను అదుపు చేస్తూ.. ఎక్కడికక్కడ నాయ‌కుల‌ను లైన్‌లో పెడుతూ వ‌చ్చింది. అయినా ప‌రిస్థితి చేయిదాటింద‌నుకోండి. కానీ, ఈ రిజ‌ల్ట్ క‌నిపించేస‌రికి నాలుగేళ్లు ప‌ట్టింది. కానీ, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు విష‌యానికి వ‌స్తే.. టీడీపీ సాధించిన ఈ రికార్డును ఏడాదిన్నర‌లోనే సాధించేసింది. ఎక్కడిక‌క్కడ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది.

ఎమ్మెల్యేలపై వ్యతిరేకత…..

ప్రభుత్వంలో ఉన్న జ‌గ‌న్‌పై పాజిటివిటీ ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై మాత్రం వ్యతిరేక‌త ఓ రేంజ్‌లో క‌నిపిస్తోంది. త‌మ‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌ని. సొంత వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని కొంద‌రు.. త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కలేద‌ని మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ప్రజ‌ల‌పై అలుగుతున్నారు. ఎంత వ‌లంటీర్లు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే సాటి రారుక‌దా ? త‌మ స‌మ‌స్యలు వ‌లంటీర్లకే చెప్పుకో చెప్పుకోవాలా ? అని కూడా ప్రజ‌లు నిల‌దీస్తున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

తీవ్ర నిరసనలు.. గ్రూపు తగాదాలు…

ఓ వైపు సంక్షేమం అంటున్నారే త‌ప్పా.. ఎక్కడ అభివృద్ధి అన్న మాటే లేదు. తాజాగా మంత్రులు జిల్లాలో ప‌ర్యటిస్తోన్న సంద‌ర్భంగా ప్రజ‌ల నుంచి అనేక నిర‌స‌న‌లు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి బొత్స ఇటీవ‌ల అనంత‌పురం జిల్లాలో ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శలు, నిరస‌న‌లు వ్యక్తమ‌య్యాయి. సో.. దీనిని బ‌ట్టి.. నాడు ఇదే వ్యతిరేక‌త వ‌చ్చేందుకు టీడీపీ నాలుగేళ్ల స‌మ‌యం ప‌డితే.. వైసీపీ ప్రభుత్వానికి ఏడాదిన్నరే ప‌ట్టింద‌ని పెద‌వి విరుస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి దీనిని జ‌గ‌న్‌ ఎలా ? గాడిలో పెడ‌తారో.. అసంతృప్తిని ఎలా త‌గ్గిస్తారో చూడాలి.

Tags:    

Similar News