పద్ధతి ప్రకారం వైసిపి పై పక్కా స్కెచ్ …?

“నాకు ఈ రాష్ట్రంలో భద్రత లేదు. ప్రాణాలకు ముప్పు ఉంది. నాపై దాడులు జరగొచ్చు. కేంద్ర బలగాల రక్షణ కావాలి.” ఇది ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ [more]

Update: 2020-06-22 05:00 GMT

“నాకు ఈ రాష్ట్రంలో భద్రత లేదు. ప్రాణాలకు ముప్పు ఉంది. నాపై దాడులు జరగొచ్చు. కేంద్ర బలగాల రక్షణ కావాలి.” ఇది ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి చేసుకున్న విజ్ఞప్తి. స్థానిక ఎన్నికల వాయిదా వివాదాస్పదంగా మారిన తరువాత తన మకాం సైతం ఆయన హైదరాబాద్ దుకాణం కూడా మార్చేశారు. ఇప్పుడు ఇదే రీతి అప్పీల్ ను అధికారపార్టీ వైసీపీ నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సైతం ఇప్పుడు చేశారు. లోక్ సభ స్పీకర్ కి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఆయన విజ్నప్తి చేయడం చర్చనీయంగా మారింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని అమెరికా, సింగపూర్, హాంకాంగ్ ల నుంచి తనను లేపేస్తామంటూ వార్నింగ్ లు ఓకే సామాజికవర్గం నుంచి వస్తున్నాయంటూ ఆయన స్పీకర్ కి రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం.

రెండు ఎపిసోడ్స్ లో ఒకే రకంగా …

నిమ్మగడ్డ ఎపిసోడ్ లోను, రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో కూడా ఒకేరీతిలో వ్యవహారం సాగడం విశేషం. ఎపి లోని జగన్ సర్కార్ కి ఎదురుతిరిగితే నూకలు చెల్లిపోయినట్లే అనే ఫోకస్ ను వీరిద్దరి వ్యవహారంలో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి తెలుగుదేశం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంవహించిందని వైసిపి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే తెరవెనుక జరిగే బాగోతాలు ఎలా ఉన్నా అధికారపార్టీ వైసీపీకి మాత్రం కావాల్సినంత డ్యామేజ్ ను ఈ వివాదాల్లో విపక్షం తెరవెనుక నుంచి చేయగలిగిందనే విశ్లేషకుల అంచనా.

సరైన వ్యూహంతో వెళ్లకుంటే..?

తాజాగా మొదలైన రఘురామకృష్ణంరాజు ఎదుర్కోవడానికి సరైన వ్యూహంతో అధికారపార్టీ వైసీపీ ముందుకు వెళ్లకపోతే మాత్రం జగన్ సర్కార్ తమకు ఎదురు తిరిగే వారిపై కేసులే కాదు భౌతిక దాడులకు సైతం దిగుతుందన్న సంకేతాలు నిజమనే అంతా నమ్మే పరిస్థితి మాత్రం ఏర్పడుతుందటున్నారు విశ్లేషకులు. ఈ తరహా రాజకీయాన్ని ఇప్పుడు అధికారపార్టీ వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News