వీరిని వదిలేస్తే.. విశ్వరూపం చూపిస్తారట

వైసీపీని ఒక రకంగా వారే కాపాడుతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి రాకుండా వాళ్లే సహకరిస్తున్నారట. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఇది చర్చనీయాంశమైంది. చంద్రబాబు, ఎల్లోమీడియా కలసి తమ పార్టీని [more]

Update: 2020-05-15 08:00 GMT

వైసీపీని ఒక రకంగా వారే కాపాడుతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి రాకుండా వాళ్లే సహకరిస్తున్నారట. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఇది చర్చనీయాంశమైంది. చంద్రబాబు, ఎల్లోమీడియా కలసి తమ పార్టీని కాపాడుతున్నారన్నది వైసీపీ వాదన. ఇందులో వాస్తవ విషయాలను కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. నాతో కొంచెం చనువుగా ఉండే వైసీపీ నేత ఒకరు ఇటీవల మాట్లాడారు. ఆయన ఎమ్మెల్యే. కొంచెం అనుభవం ఉన్న ఎమ్మెల్యే కావడంతో ఆయన రాజకీయాలతో పాటు ప్రజల నాడిని కూడా ఎప్పటికప్పుడు పసిగట్టే నేతగా పేరుంది.

సీనియర్ నేత ఏం చెప్పారంటే?

ఆయన చెప్పిన మాటలు విని నాకే మతి పోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రజలు బంపర్ మెజారిటీ కట్టబెట్టారు. ఇందులో ఎక్కువశాతం మంది కొత్తగా ఎన్నికయిన వారే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన పాలనలో అవినీతి ఉండదని చెప్పేశారు. అవినీతికి పాల్పడ్డవారిని సహించనని కూడా చెప్పారు. కాని కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ఇవేమీ పెద్దగా పట్టించుకోలేదట. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచి చేతులు కట్టుకుని కూర్చోమంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు కూడా.

ఇసుక దందాకు తెరతీసి….

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అధికారులు, ప్రభుత్వం కూడా దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలకు సేవా కార్యక్రమాలు చేయాలని మాత్రం జగన్ పిలుపు నిచ్చారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం సేవా కార్యక్రమాలతో పాటు తమ పనిని కూడా ప్రారంభించేశారు. ఇసుక దందాకు తెరతీశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన తన వ్యాపార కార్యక్రమాలకు ఇసుకను తరలించడం ప్రారంభించారు. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీ కావడంతో ఇద్దరూ కలసి ఇసుక దందాకు దిగారు. దీంతో టీడీపీ, దాని అనుభంధ మీడియా దానిని బయటపెట్టింది. ఆరు లారీలతోనే ఆయన ఇసుక తవ్వకాలను ముగించాల్సి వచ్చింది. అదే టీడీపీ నేతలు బయటపెట్టకపోతే ఆయన దందా జగన్ వరకూ వెల్లేందంటున్నారు.

విరాళాల పేరుతో…..

కరోనా సమయంలో మరికొందరు దందాలకు కూడా దిగినట్లు ఆరోపణలున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే విరాళాల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. ఈవిషయాన్ని కూడా టీడీపీ బయటపెట్టింది. దీంతో ఆయన సర్దుకోవాల్సి వచ్చింది. పూర్తిగా జగన్ దృష్టికి రాకముందే, ప్రజల్లోకి వెళ్లకముందే వీళ్లు బయటపెడుతుండటం తమ పార్టీకి మేలుచేస్తుందని ఆ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే నాతో అభిప్రాయపడ్డారు. నిజంగా ఆయన చెప్పింది నిజమేననిపించింది. వైసీపీ నేతలను దారిలో పెడుతుంది, గాడిలో పడేలా చేస్తుంది టీడీపీయేనంటున్నారు.

Tags:    

Similar News