జూనియర్లకు ఫియర్ ఎందుకంటే?

గెలిచామన్న ఆనందం లేదు. సంతృప్తిలేదు. చేతిలో పనిలేదు. తమ వద్దకు ఎవరూ రావడం లేదని బెంగ పట్టుకుంది. ఇదీ జగన్ పార్టీ ఎమ్మెల్యేల మనోవేదన. సంక్షేమ పథకాల [more]

Update: 2019-11-22 14:30 GMT

గెలిచామన్న ఆనందం లేదు. సంతృప్తిలేదు. చేతిలో పనిలేదు. తమ వద్దకు ఎవరూ రావడం లేదని బెంగ పట్టుకుంది. ఇదీ జగన్ పార్టీ ఎమ్మెల్యేల మనోవేదన. సంక్షేమ పథకాల అర్హుల జాబితా, పథకాల అమలులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేకపోవడంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఎవరూ గుర్తించడం లేదట. ఇప్పుడు నిధుల లేమి కూడా ఉండటంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పని కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది.

క్లీన్ స్వీప్ చేసినా…..

ప్రధానంగా విజయనగరం జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. టీడీపీకి ఇక్కడ బోణీ కూడా కాలేదు. దీంతో వైసీపీ వర్గాలు సంబరపడ్డాయి. కొద్దిరోజుల పాటు తమదే రాజ్యం అని సంబరపడిన ఎమ్మెల్యేలకు తర్వాత క్రమంగా పరిస్థితి అర్థమయింది. గెలిచిన వారిలో సీనియర్ లు కొందరైతే పూర్తిగా ఎమ్మెల్యేలు అయిన వారు మరికొంత మంది. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి పరిస్థితి అర్థంకానట్లు ఉంది.

శాసిద్దామనునకున్నా…..

నియోజకవర్గాలను శాసించవచ్చని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిలో అనేక మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే తమ మాటే చెల్లుబాటు అవుతుందనుకున్న ఎమ్మెల్యేలకు అది కాని పని అని నాలుగు నెలల తర్వాత కాని అర్థం కాలేదు. ఇప్పుడు జనాలకు జగన్ ఫొటో తప్ప ఎమ్మెల్యేలు పెద్దగా కన్పించడం లేదు. పైగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారుల అకౌంట్లోనే పడిపోతున్నాయి. దీంతో జనాలకు కూడా పెద్దగా ఎమ్మెల్యేలతో పని లేకుండా పోయింది.

ప్రమేయం లేకపోవడంతో…..

దీంతోపాటు గతంలో లబ్దిదారుల ఎంపికను నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలే చూసుకునే వారు. అప్పట్లో ఎమ్మల్యేల ఇళ్లవద్ద జనం తాకిడి ఉండేది. కానీ ఇప్పుడు లబ్దిదారులు దరఖాస్తులను ఆన్ లైన్ లో చేసుకోవడం, ఎంపిక జరిగిపోతుండటంతో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోయింది. ఇక మద్యం దుకాణాల రద్దు, ఇసుకను టైట్ చేయడం, కాంట్రాక్టులేవీ లేకపోవడంతో అనుచరులు కూడా ఎమ్మెల్యేల మొహం చూడటం లేదట. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు జావగారిపోయారట. మొత్తం మీద సీనియర్ ఎమ్మెల్యేలు కొంత పరవాలేకున్నా కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం నిద్రపట్టడం లేదన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది.

Tags:    

Similar News