వీళ్లు వైసీపీ క్రెడిబులిటీని దెబ్బతీస్తారా?

రాజ‌కీయాల్లో ఉన్న ప్రత్య‌ర్థులు సంయ‌మ‌నం కోల్పోతున్నారు. నోటికి వ‌చ్చిన వ‌చ్చిన విధంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు, వ్యంగ్యాస్త్రాలు బాగా [more]

Update: 2020-01-17 08:00 GMT

రాజ‌కీయాల్లో ఉన్న ప్రత్య‌ర్థులు సంయ‌మ‌నం కోల్పోతున్నారు. నోటికి వ‌చ్చిన వ‌చ్చిన విధంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు, వ్యంగ్యాస్త్రాలు బాగా వినప‌డుతున్నాయి. అయితే, ఇవి ఎబ్బెట్టుగా ఉండ‌డం, ప్రజ‌ల మ‌ధ్య వ‌చ్చి మ‌ళ్లీ వివ‌ర‌ణ ఇచ్చుకునేలా ఉండ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారుతోంది. పోక‌చెక్కతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్కతో నే రెండంటా.. అనే ధోర‌ణిని నాయ‌కులు బాగా ఒంట‌ప‌ట్టించుకున్నారు. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా హ‌ద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారు.

ద్వారంపూడి వ్యాఖ్యలతో….

తాజాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు ద్వారంపూడి చంద్రశేఖ‌ర‌రెడ్డి.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి చేసిన ప‌రుష ప‌దాలు చ‌ర్చనీయాంశంగా మారాయి. విమ‌ర్శల స్థానంలో బూతులు రాజ్యమేలాయి. ఇది నిజంగా ఎంత వైసీపీని స‌మ‌ర్ధించే వారికైనా ఒకింత బాధ‌క‌లిగించే అంశ‌మే. వాస్తవానికి ప్రస్తుత ప‌రిస్తితి వైసీపీకి తీవ్ర అగ్ని ప‌రీక్ష వంటిద‌న‌డంలో సందేహం లేదు. భ‌విష్యత్తులోనూ తిరుగులేని యువ రాజ‌కీయ నేత అనిపించుకోవాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ వేస్తున్న కీల‌క అడుగు మూడు రాజ‌ధానులు. ఇది స‌క్సెస్ అవుతుందా? అయితే వ‌చ్చే లాభం ఏంటి?; ఒక‌వేళ విఫ‌ల‌మైతే.. జ‌రిగే అన‌ర్థం ఏంటి? అనే అంశాల‌పై ఒక‌ప‌క్క పార్టీలో విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది.

సౌమ్యుడిగా ఉండే….

అయితే, ఏనాడూ దూకుడు చూప‌ని చంద్రశేఖ‌ర‌రెడ్డి, సౌమ్యుడిగా పేరున్న ద్వారంపూడి.. ఒక్కసారిగా ఆగ్రహాన్ని ప్రద‌ర్శించ‌డం, బాబు, పవన్ లపై విమ‌ర్శలు చేయ‌డం వంటివి నిజంగానే ప్రజాస్వామ్య వాదుల‌ను క‌ల‌చి వేశాయి. వాస్తవానికి సంయ‌మ‌నం, స‌హ‌నం విష‌యంలో వైసీపీ నాయ‌కులు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ను చూసి నేర్చుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌పై అనేక రూపాల్లో వ్యాఖ్యల ప‌రంప‌ర సాగింది. ఫ్యాక్షనిస్టు అన్నారు. అవినీతి దురంధ‌రుడ‌ని ముద్రవేశారు. రాష్ట్రాన్ని దోచేస్తాడ‌ని చెప్పారు. నేర‌స్తుడ‌ని ప్రచారం చేశారు. మాన‌సికంగా ఎన్నివిధాల ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు.

గతంలోనూ…..

ఆఖ‌రుకు సీఎం అయ్యాక తుగ్లక్‌తో పోలుస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. వార్తలు రాయిస్తున్నారు. అయినా కూడా జ‌గ‌న్ ఎక్కడా ఆవేశ ప‌డ‌డం లేదు. ఆగ్రహించ‌డ‌మూ లేదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే (అసెంబ్లీలో) మాట్లాడుతున్నారు. ఎక్కడ కౌంట‌ర్ చేయాలో అక్కడే చేస్తున్నారు. గ‌తంలో పోలీసులు కూడా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టారు. ఆయ‌న‌కు ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా సాధార‌ణ జీపులో కోర్టుకు హాజ‌రుప‌రిచారు. దీనిని తీవ్రంగా భావించిన జ‌గ‌న్ మౌనంగా కోర్టు హాల్లోకి వెళ్లి నేరుగా జ‌డ్జికి పోలీసుల వైఖ‌రిపై ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయమూర్తి పోలీసుల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇవ్వడంతోపాటు ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌గ‌న్‌ను గ‌ట్టి భ‌ద్రత మ‌ధ్యే కోర్టుకు తీసుకురావాల‌ని తీసుకువెళ్లాల‌ని ఆదేశించారు. ఇలా ప్రతి విష‌యంలోనూ స‌హ‌నం, సంయ‌మ‌నం కోల్పోకుండా జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్న తీరు వైసీపీ నాయ‌కుల‌కు ఆద‌ర్శంగా ఉండాలే త‌ప్ప.. సంయ‌మ‌నం కోల్పోయి నోరు తూలితే.. పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టిన వార‌వుతార‌నే విష‌యాన్ని గుర్తించాలి.

Tags:    

Similar News