ఆధిపత్య పోరు ఆగేట్లు లేదుగా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు జరుగుతుంది. రెండువర్గాలుగా విడిపోయి పార్టీకి నేతలు నష్టం తెస్తున్నారు. అందులో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం [more]

Update: 2021-06-07 11:00 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు జరుగుతుంది. రెండువర్గాలుగా విడిపోయి పార్టీకి నేతలు నష్టం తెస్తున్నారు. అందులో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఒకటి. ఉరవకొండ నియోజకవర్గంలో వైసీీపీలో రెండు గ్రూపుల మధ్య పోరు తారాస్థాయికి చేరిందంటున్నారు. అధిష్టానం అనేక సార్లు నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలతో గ్రూపు విభేదాలు ఉరవకొండ వైసీపీలో భగ్గుమంటున్నాయి.

ఇక్కడ మాత్రం…?

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాతో వైసీపీ అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కానీ అనంతపురం జిల్లాలో ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ గెలిచింది. ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఆయనను వైసీపీ ఇన్ చార్జిగా నియమంచింది.

వారిదే పెత్తనం…

ఉరవకొండలో టీడీపీ విజయం సాధించినా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి చెప్పినట్లు అధికారులు నడుచుకోవాల్సిందే. వాలంటీర్ల నియమాకం నుంచి లబ్దిదారుల ఎంపిక వరకూ వీరు చెప్పినట్లే జరగాలి. వైసీపీలో ఉన్న మరోనేత, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కూడా ఆధిపత్యం కోసం రెండేళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేరుగా అధిష్టానాన్ని కలసి తాను అనుకున్న పనులను సాధించుకుంటున్నారు.

తాడేపల్లి నుంచి కాల్….

ఇటీవల కాలంలో మళ్లీ రెండువర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయంటున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనడం, పార్టీ కార్యక్రమాలకు శివరామిరెడ్డ వర్గానికి ఆహ్వానం లేకపోతుండటతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. దీంతో మరోసారి అధినాయకత్వం రెండు వర్గాలను తాడేపల్లికి రమ్మని చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. టీడీపీని బలహీన పర్చాల్సిన వైసీపీ నేతలు తమలో తాము ఘర్షణలకు దిగుతూ పార్టీని మరింత బలహీనం చేస్తున్నాయి.

Tags:    

Similar News