వైసీపీలో ర‌గ‌డ… సీనియ‌ర్లను కాద‌ని జూనియ‌ర్లే

తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ వైసీపీలో తీవ్రవిభేదాలు చోటు చేసుకున్నా యి. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్రస్థాయిలో విమ‌ర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. సీనియర్‌గా [more]

Update: 2020-02-29 02:00 GMT

తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ వైసీపీలో తీవ్రవిభేదాలు చోటు చేసుకున్నా యి. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తీవ్రస్థాయిలో విమ‌ర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. సీనియర్‌గా ఉన్న నాయ‌కుల‌ను ప‌క్కన పెట్టి జూనియ‌ర్లు హ‌వా చ‌లాయిస్తుండ‌డ‌మేన‌ని అంటున్నారు. విషయం లోకి వెళ్తే.. రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో బొంతు రాజేశ్వర‌రావు వైసీపీ నాయ‌కుడిగా గ‌త ప‌దేళ్లుగా చ‌లామ‌ణిలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీని డెవ‌ల‌ప్ చేసింది కూడా ఆయ‌నే. ఈ క్రమంలోనే పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా బొంతుకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో బొంతుకే టికెట్ ఇచ్చా

రు.

ఇన్ ఛార్జిని మార్చడంతో…

ప్రభుత్వ ఉద్యోగిగా ప‌నిచేసిన రాజేశ్వర‌రావు వైసీపీ కోసం అక్కడ భారీగ‌గా ఖ‌ర్చు చేయ‌డంతో జ‌గ‌న్ రెండుసార్లు సీటు ఇవ్వగా రెండు సార్లు కూడా బొంతు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. 2014లో టీడీపీ, 2019లో జ‌న‌సేన ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాయి. దీంతో సాధార‌ణంగానే వైసీపీ నేత‌ల్లోనూ, అధిష్టానంలోనూ కూడా అసంతృప్తి రాజుకోవ‌డం స‌హ‌జం. ఈ క్రమంలోనే ఇక్కడ పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. రాజోలు ఇంచార్జ్ ప‌దవిని ఎస్సీ మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి క‌ట్టబెట్టారు. దీంతో అప్పటి వ‌రకు బొంతు వ‌ర్గం దూకుడును అమ్మాజి క‌ట్టడి చేశారు.

పార్టీ ఆవిర్భావం నుంచి….

అమ్మాజీకి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ప‌ద‌వి ఇచ్చాక గ్రూపు రాజ‌కీయాలు మితిమీరిపోయాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఇక్కడ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఒక‌టి బొంతు వ‌ర్గంకాగా, రెండోది అమ్మాజీ వ‌ర్గంగాను చీలిపోయింది. పార్టీ కోసం పది సంవత్సరాలుగా కష్ట పడుతున్న కార్యకర్తలను ప్రక్కన పెట్టారంటూ అమ్మాజీపై బొంతు వ‌ర్గం నిప్పులు చెరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుండి రాజోలులో వైసీపీ కోసం కృషి చేస్తున్నామ‌ని, ఇప్పుడు మాత్రం మమ్మల్ని ప్రతిపక్ష పార్టీ వారిలా చూస్తున్నారని మండి ప‌డుతున్నారు.

రాపాక కూడా….

ప్రభుత్వం నుండి గ్రాంట్ చేసిన సీసీ రోడ్డు కాంట్రాక్టులు కూడా వారికే ఇస్తూ దందాలు చేస్తున్నారని అమ్మాజీపై విమ‌ర్శలు చేస్తున్నారు. ఇలా అమ్మాజీపై స్థానిక నేత‌లు, ముఖ్యంగా బొంతు వ‌ర్గం తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, తాటిపాక సెంటర్ లో వైఎస్సార్ విగ్రహ పాదాలకు వినపత్రం పెట్టి , అమ్మాజీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 216 జాతీయ రహదారి ని నిర్భంధించ‌డం మ‌రింత వివాదానికి దారితీసింది. మ‌రోప‌క్క, జ‌న‌సేన నుంచి గెలిచిన రాపాక కూడా అమ్మాజీ వర్గానికే మ‌ద్దతు ప‌లుకుతుండ‌డంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని నాయ‌కులు అంటున్నారు. మొత్తానికి ఇక్కడ పార్టీ బ‌లంగా ఉన్నప్పటికీ. నాయ‌కుల మ‌ధ్య నెల‌కొన్ని విభేదాలు, వివాదాల కార‌ణంగా.. పార్టీ న‌ష్టపోతోంద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ స‌మ‌స్య ఎప్పటికి ఎలా ప‌రిష్కారం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News