రాజుగారి ఎఫెక్ట్…. రాజోలులో మామూలుగా లేదుగా

రాజుల సామాజిక వ‌ర్గం ఏపీలో ప‌శ్చిమ గోదావ‌రి డెల్టాతో పాటు తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ‌లో ఎక్కువుగా ఉంటుంది. చంద్రబాబు పాల‌న‌లో వాళ్లకు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వక‌పోవ‌డంతో [more]

Update: 2020-10-21 02:00 GMT

రాజుల సామాజిక వ‌ర్గం ఏపీలో ప‌శ్చిమ గోదావ‌రి డెల్టాతో పాటు తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ‌లో ఎక్కువుగా ఉంటుంది. చంద్రబాబు పాల‌న‌లో వాళ్లకు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వక‌పోవ‌డంతో ర‌గిలిపోయిన రాజులు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ వైపున‌కు బాగా మొగ్గు చూపారు. జ‌గన్ కూడా ప‌శ్చిమ‌లోనే మూడు అసెంబ్లీ, న‌ర‌సాపురం ఎంపీ సీటును వారికి కేటాయించారు. ఇక ఎన్నిక‌ల్లో గెలిచి జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆ వ‌ర్గానికి చెందిన రంగ‌నాథ రాజును త‌న కేబినెట్లోకి తీసుకోవ‌డంతో పాటు మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు త‌న‌యుడికి న‌ర‌సాపురం పార్లమెంట‌రీ జిల్లా పార్టీ ప‌గ్గాలు కూడా అప్పగించారు. అయితే ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పార్టీలో ఇప్పుడు పెద్ద అస‌మ్మతి నేత‌గా మారిపోయారు.

రాజు గారి ప్రభావం…..

ప‌శ్చిమ‌లో వైసీపీ రాజుల్లో ర‌ఘురామ పార్టీకి మైన‌స్‌గా మార‌గా అటు న‌రసాపురం ప‌క్కనే ఉన్న తూర్పుగోదావ‌రి కోన‌సీమ‌లోని రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ రాజులు పార్టీని నాశ‌నం చేసేస్తున్నార‌న్న విమ‌ర్శలు పార్టీలోనే మిగిలిన వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజోలు నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్‌గా ఉన్నప్పుడు క్క‌డ రాజుల‌దే రాజ‌కీయ ఆధిపత్యం. 2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయిన‌ప్పుడు ఎవ‌రు గెలిచినా రాజులే రాజకీయం చేస్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో త‌మ చెప్పు చేత‌ల్లో ఉండే రాపాక వ‌ర‌ప్రసాద‌రావు‌కు వైసీపీ సీటు ఇప్పించుకునేందుకు మాజీ ఎమ్మెల్యేతో పాటు రాజోలు రాజ‌కీయం శాసిస్తోన్న మ‌రో ఇద్దరు ముగ్గురు నేత‌లు విశ్వప్రయ‌త్నాలు చేశారు.

అప్పట్లో అందరూ జనసేనకు…

అయితే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ఎంతో క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేసిన బొంతు రాజేశ్వర‌రావును త‌ప్పించేందుకు జ‌గ‌న్ ఇష్టప‌డ‌క‌పోవ‌డంతో రాజేశ్వర‌రావుకు వైసీపీ సీటు ద‌క్కింది. అయితే నాడు ఈ రాజులు అంద‌రూ జ‌న‌సేన‌లోకి జంప్ చేసి వ‌న్‌సైడ్‌గా జ‌న‌సేన అభ్యర్థి రాపాక వ‌ర‌ప్రసాద‌రావుకు స‌పోర్ట్ చేసి గెలిపించుకున్నారు. ఇదే రాపాక 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన‌ప్పుడు రాజుల చెప్పుచేత‌ల్లోనే ఉన్నార‌న్న టాక్ అప్పుడే ఉంది. ట్విస్ట్ ఏంటంటే రాజోలులో వైసీపీని ఓడించిన ఈ రాజుల గ్యాంగ్ అంతా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ ద‌గ్గర‌కు వెళ్లి వైసీపీ కండువాలు క‌ప్పుకుంది.

రాజుల లాబీయింగ్ తో…

నియోజ‌క‌వ‌ర్గంలో ఆరేడేళ్ల నుంచి ప‌నిచేయ‌డంతో పాటు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన బొంతు రాజేశ్వరావు రాజుల డ్రామాల‌ను అంగీక‌రించ‌డం లేదు. దీంతో రాజేశ్వర‌రావును నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాల నుంచి బ‌ల‌వంతంగా త‌ప్పించేలా చేయ‌డంలో ఈ రాజుల లాబీయింగ్ స‌క్సెస్ అయ్యింది. జ‌గ‌న్ రాజుల ఒత్తిళ్లకు త‌లొగ్గి బొంతును నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా త‌ప్పించి ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మన్ పెద‌పాటి అమ్మాజీకి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు అమ్మాజీ సైతం రాజుల‌ను లైట్ తీస్కోవ‌డంతో వారు మ‌ళ్లీ ఆమెను కూడా త‌ప్పించాల‌ని జ‌గ‌న్‌పై ఒత్తిడి చేస్తోన్న ప‌రిస్థితి. అయితే జ‌గ‌న్ ఈ సారి వాళ్ల మాట‌లు వినే ప‌రిస్థితి లేదు.

రాజుల‌కు మంత్రుల మద్దతుతో…..

మంత్రి చెల్లుబోయిన వేణు సొంత నియోజ‌క‌వ‌ర్గం రాజోలు. దీంతో ఆయ‌న కూడా రాజుల రాజ‌కీయానికి త‌లొగ్గి రాపాక‌కే నిధులు ఇవ్వడం, రాపాక‌నే అధికార పార్టీ ఎమ్మెల్యేగా చూస్తున్నార‌ని పార్టీలోనే కొంద‌రు గుర్రుగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు, అటు రాజులు చేస్తోన్న రాజ‌కీయంతో వైసీపీ రాజోలులో బ్రష్టుప‌ట్టిపోతోంద‌ని అక్కడ పార్టీ వీరాభిమానులు, పార్టీ కోసం ఏళ్లుగా క‌ష్టప‌డుతున్న వారు వాపోతున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో రు. 163 కోట్లు అభివృద్ధి కోసం రిలీజ్ అయితే అందులో రు. 100 కోట్లకు పైగా నిధులు జ‌న‌సేన నుంచి వచ్చిన వైసీపీకి సానుభూతిప‌రులు అయిన కార్యక‌ర్తల‌కే ఇచ్చేశార‌ని వైసీపీ కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతోంది. ఇటు వైసీపీలో చ‌క్రం తిప్పుతోన్న ఆ రాజులు మాట‌లు ఇద్దరు మంత్రులు వింటే రాజోలులో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌ద‌ని… రాపాక‌కు ప‌గ్గాలు ఇస్తే అక్కడితోనే వైసీపీ రాజ‌కీయం ముగిసిన‌ట్టే అన్న చ‌ర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News