అధిష్టానం మొట్టికాయలతో ఆగిన తిరుగుబాటు …?

వైసీపీ ప్రాంతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ వాసనలు ఆ పార్టీని ఇంకా వెన్నాడుతున్నాయి. గ్రూప్ లు ఆధిపత్యం అధిష్టానం ఆదేశాలను భేఖాతర్ చేయడం వంటివి ఇటీవల [more]

Update: 2020-07-18 02:00 GMT

వైసీపీ ప్రాంతీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ వాసనలు ఆ పార్టీని ఇంకా వెన్నాడుతున్నాయి. గ్రూప్ లు ఆధిపత్యం అధిష్టానం ఆదేశాలను భేఖాతర్ చేయడం వంటివి ఇటీవల పురివిప్పుతున్నాయి. తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో వైసీపీ గ్రూప్ లన్ని అక్కడి ఇన్ ఛార్జ్ కి వ్యతిరేకంగా జండా ఎత్తాలనుకున్నారు. వారు ఇలా అనుకున్నారో లేదో పేపర్ లీక్ అయ్యి అధిష్టానానికి విషయం చేరింది. దాంతో సీన్ సీరియస్ గా పరిగణించిన పార్టీ అధిష్టానం పెద్దలు అందరికి చీవాట్లు పెట్టేశారు. మొట్టికాయలు మొట్టేశారు. దాంతో అంతా దారికొచ్చారు. తిరుగుబాటు కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కాస్తా ప్రస్తుత ఇన్ ఛార్జ్ సూపర్ అంటూ టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే అసమర్థుడంటూ ఆయనపైకి తిరగడం చర్చనీయం అయ్యింది.

ఆకుల వీర్రాజు పై యుద్ధం …

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఆకుల వీర్రాజు రెండుసార్లు పోటీలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ రెండు సార్లు పార్టీలో టికెట్ ఆశించిన వారే వెన్నుపోటు కారణమని ఆయన అధిష్టానానికి ఇచ్చిన నివేదికలో గతంలోనే పేర్కొన్నారు. 2014 లో 20000 వేల ఓట్ల మెజారిటీ, రెండోసారి 10 వేల ఓట్ల తేడాతో గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఓటమి పాలయ్యారు. ఈ ఓటములకు కారణాలను విశ్లేషిస్తే శాటిలైట్ సిటీ లో పిల్లి సుబ్రహ్మణ్యం, వేమగిరి లో రావిపాటి రామచంద్రరావు, కడియం లో గిరజాల బాబు లు కట్టప్పలయిపోయారన్నది వీర్రాజు వర్గీయుల అంచనా.

ముప్పుతిప్పలు పెడుతున్న ముగ్గురు …

ఈ ముగ్గురు ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉంటూ బాగానే ఉన్నా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆకుల వీర్రాజు కు ముగ్గులు వేస్తూ చికాకులు పెడుతూనే ఉన్నారని అంటున్నారు. రెండు సార్లు ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి నష్టపోయినా పార్టీ కార్యక్రమాల్లో వీర్రాజు చురుగ్గానే సాగుతున్నారు. జగన్ సైతం ఆయనపై నమ్మకం కొనసాగిస్తున్నారు. అయినప్పటికి గ్రూప్ ల నేతలు చేష్టలు భరించలేక పోతున్నామంటున్నారు ఆయన వర్గీయులు. రాజమండ్రి రూరల్ నుంచి బలంగా ఉన్న టిడిపి నేతలు కొందరు వైసీపీ లోకి రప్పించేందుకు సైతం వీర్రాజు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ వారే చుక్కలు చూపించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి అధిష్టానం గ్రూప్ ల గోలకు చెక్ పెట్టినా భవిష్యత్తులో కూడా వీరంతా ఇదే ఐక్యతా రాగం పాడతారా లేదా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News