పాల‌కొల్లు వైసీపీ రాజ‌కీయాల్లో ర‌గ‌డ‌.. టార్టెట్ కౌరు

రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీ రాజ‌కీయాలు అనూహ్యంగా రోడ్డున ప‌డుతున్నాయా? సొంత పార్టీలోనే యువ నేత‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి పెరిగిపోయిందా? [more]

Update: 2020-05-30 13:30 GMT

రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీ రాజ‌కీయాలు అనూహ్యంగా రోడ్డున ప‌డుతున్నాయా? సొంత పార్టీలోనే యువ నేత‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి పెరిగిపోయిందా? మంత్రిగా ఉన్న కీల‌క నాయ‌కుడు, సీనియ‌ర్ నేత వివాదాల‌కు కేంద్రంగా మారారా ? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు.. ఔన‌నే అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయాలంటే.. కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కేన‌ని, త‌ర్వాత అంద‌రూ క‌లిసిమెలిసి ఉంటార‌ని గ‌తంలో ఒక ఆద‌ర్శం దేశ‌వ్యాప్తంగా ప్రచారంలో ఉంది. అయితే, రాను రాను ఈ ప‌రిస్థితి మారిపోయింది.

కత్తులు దూసుకుంటూ….

ప్రత్యర్థి పార్టీలు క‌త్తులు దూసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా అధికార వైసీపీలోనే నేత‌ల మ‌ధ్య తీవ్ర విభేదాలు, టార్గెట్ చేసుకుని మ‌రీ నాయ‌కుల‌ను డైల్యూట్ చేసే సంస్కృతి పెరిగిపోయింది. జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు త‌న హ‌వా పెంచుకునేందుకు తెగ దూకుడు ప్రద‌ర్శిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. త‌న వ‌ర్గం మాత్రమే లైవ్‌లో ఉండాల‌నే వ్యూహంతో స‌ద‌రు మంత్రి వ్యవ‌హ‌రిస్తున్న తీరు పార్టీలో చ‌ర్చకు, వివాదానికి కూడా కార‌ణం అవుతోంది. దీంతో డెల్లా వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయి.

డెల్టా వైసీపీలో…..

ఇంత‌కీ రీజ‌న్ ఏంటంటే.. పాల‌కొల్లు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న యువ నాయ‌కుడు, బీసీ వ‌ర్గంలోని శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన కౌరు శ్రీనివాస్‌ను ఒంట‌రిని చేయ‌డం, రాజ‌కీయంగా బ‌ద్నాం చేయ‌డ‌మే స‌ద రు మంత్రి, ఆయ‌న అనుచ‌రుల కీల‌క వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. నిజానికి కౌరు శ్రీనివాస్ అతి త‌క్కువ కాలంలో వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా, జ‌గ‌న్‌కు అత్యంత నమ్మక‌స్తుడిగా ఎదిగారు. 2014లో ఆచంటకు ఇంచార్జ్‌గా ఉన్న కౌరు శ్రీనివాస్‌ అప్పటి మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌కు కౌంట‌ర్లు బాగానే ఇచ్చేవారు. అదేస‌మ‌యంలో పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేశారు.

పొగెబట్టాలన్న ప్రయత్నమే…

అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఈ సీటు ను ప్రస్తుత మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజు కోసం కౌరు శ్రీనివాస్‌ త్యాగం చేశారు. పార్టీలో న‌మ్మకంగా ఉండ‌డం, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉండ‌డంతో ఆయ‌న‌కు వ‌రుస‌గా పార్టీలో ప్రాధాన్యం ల‌భించింది. జ‌గ‌న్ కౌరు శ్రీనివాస్‌ కు డీసీసీబీ చైర్మన్‌, పాల‌కొల్లు పార్టీ ఇంచార్జ్ ప‌దవులు ఇచ్చారు. త్వర‌లోనే జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ ఇవ్వనున్నార‌ని, దాదాపు ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. .జ‌గ‌న్ నుంచి హామీ రావ‌డంతోనే కౌరు శ్రీనివాస్ య‌ల‌మంచిలి జ‌డ్పీటీసీగా కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి కూడా కౌరు శ్రీనివాస్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఫ‌లితంగా పాల‌కొల్లు త‌దిత‌ర ప్రాంతాల్లో కౌరు శ్రీనివాస్‌ హ‌వా భారీగా ఉంది. దీనిని త‌ట్టుకోలేని.. ఒక‌రిద్దరు ఎమ్మెల్యేలు, జిల్లాకే చెందిన నాయ‌కులు.. కౌరుకు ఏదో ఒక రకంగా పొగ‌బెట్టాల‌ని చూస్తున్నారు.

భూముల వ్యవహారంలో….

ఈ క్రమంలోనే పోడూరు మండ‌లంలోని భూముల వ్యవ‌హారం తెర‌మీదికి తెచ్చి.. కౌరు శ్రీనివాస్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీటీసీలు జ‌న‌సేన‌, టీడీపీకి ఏక‌గ్రీవం అయ్యేలా స‌ద‌రు మంత్రి కుట్రలు కుతంత్రాల‌కు తెర‌లేపార‌ని కూడా సొంత పార్టీ నేత‌ల్లోనే విమ‌ర్శలు ఉన్నాయి. ఇక ఇదే పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌రో బీసీ వైసీపీ నేత సైతం వీలున్నప్పుడ‌ల్లా ఇటు సొంత పార్టీ నేత‌లు.. అటు ప్రతిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి కౌరు శ్రీనివాస్‌ను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్యం.

జగన్ వద్దకు పంచాయతీ….

ఇదే విష‌యం ప్రస్తుతం వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్లింద‌ని స‌మాచారం. త్వర‌లోనే ఈ విష‌యాన్ని తేలుస్తార‌ని ప్రచారం సాగుతోంది. ఏదేమైనా.. పార్టీలో నిన్నగాక మొన్నవ‌చ్చిన వారి పెత్తనం ఎక్కువ‌గా ఉంద‌ని, కౌరు శ్రీనివాస్‌ వంటి యువ నేత‌ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు ఆయన అనుచరులు. ఇక సద‌రు మంత్రికి జ‌గ‌న్ ఇప్పటికే ప‌లు విష‌యాల్లో వార్నింగ్ ఇచ్చినా ఆయ‌న తీరు మాత్రం మారలేదు. మ‌రి ఈ సారి జ‌గ‌న్ ఎలా ట్రీట్‌మెంట్ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News