నాడి పట్టుకోవడం కష్టమేనా?

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ గ్రామీణప్రాంతాల్లో తన సత్తా చాటింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఉంది. పార్టీ గుర్తు మీద జరిగే [more]

Update: 2021-03-01 02:00 GMT

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ గ్రామీణప్రాంతాల్లో తన సత్తా చాటింది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఉంది. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కావడంతో వైసీపీకి ఇక్కడ బలం నిరూపించుకోవడం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అత్యవసరం. రెండేళ్ల పాలనలో తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఆధారం. అందుకోసమే వైసీపీ ఈఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది.

పట్ణణ ప్రాంతాలను…

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అలా ఉండదు. అధికారంలో ఉండటంతో సహజంగానే వైసీపీికి మున్సిపల్ ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. కానీ రెండేళ్ల పాలనలో జగన్ పట్టణ ప్రాంతాలవైపు చూడలేదు. సంక్షేమ పథకాలను అందిస్తున్నారు తప్పించి అభివృద్ధి వైపు చూడలేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా విడుదల చేయకపోవడంతో పట్టణ ప్రాంత ఓటర్ల నాడి ఎలా ఉందో చెప్పలేం.

మంత్రులకే బాధ్యతలు….

ఆంధ్రప్రదేశ్ లో 75 మున్సిపాలటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మేజర్ మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానంగా ఈ బాధ్యతలను వైసీపీ అధినేత జగన్ మంత్రులకు అప్పగించారు. మున్సిపాలిటీల వారీగా మంత్రులు ప్రచార బాధ్యతలను చూసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

టీడీపీ బలహీనంగా ఉండటం….

పట్టణ ప్రాంతాల్లో టీడీపీ కొంత బలహీనంగా ఉండటం వైసీపీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేసి ఉండటం, ఆర్థికంగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనడటంతో టీడీపీకి అనేక చోట్ల మేయర్ అభ్యర్థులే కరువయ్యారు. మేయర్ అభ్యర్థులే ఆర్థికంగా వార్డు అభ్యర్థులను ఆదుకోవాలని టీడీపీ అధిష్టానం సూచించింది. అయినా అనేక చోట్ల ఆ పరిస్థితి లేదు. దీంతో వైసీపీకి కొంత విజయావకాశాలే కన్పిస్తున్నాయి. అయితే పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News