కర్నూలులో బోణీ కొడతారా? లేదా?

కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. టీడీపీ ఇక్కడ [more]

Update: 2021-02-28 11:00 GMT

కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. టీడీపీ ఇక్కడ బలహీనంగా మారింది. నాయకులంతా దాదాపు చేతులెత్తేశారు. వైసీపీ ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. వార్డుల వారీగా సీనియర్ నేతలకు వైసీపీ బాధ్యతలను అప్పగించింది.

బలహీనంగా ఉన్న టీడీపీ…..

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 51 వార్డులున్నాయి. నిజానికి కర్నూలు కార్పొరేషన్ కు 2010 సెప్బంబరు 29తో కాలపరిమితి ముగిసింది. దాదాపు పదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతుంది. అయితే టీడీపీ ఇక్కడ బలహీనం కావడానికి అనేక కారణాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఇక్కడ వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది.

వైసీపీలో విభేదాలు…

అయితే వైసీపీ నేతల్లో విభేదాలు ఫలితాలపై కొంతవరకూ ప్రభావం చూపే అవకాశముంది. కర్నూలు నగర నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరిద్దరూ తమ వర్గానికి చెందిన వారిని గతంలో నామినేషన్లు వేయించారు. అయితే ఇప్పుడు ఇద్దరు కలసి పనిచేస్తేనే అత్యధిక వార్డులను వైసీపీ గెలుచుకునే అవకాశముంది. లేకుంటే ఆశించిన స్థానాలు రాకపోవచ్చు.

చివరకు గెలుపు మాత్రం….?

అందుకోసమే సీనియర్ నేతలు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు టీడీపీలో కూడా నేతల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ టీజీ భరత్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. కార్పొరేటర్లకు టిక్కెట్ల కేటాయింపులో తమ వర్గానికి అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆరోపించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన వర్గాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు వైసీపీ, అటు టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నా చివరకు కర్నూలులో వైసీపీ జెండాయే ఎగరనుంది. ఇందుకు కారణం కర్నూలును జగన్ న్యాయరాజధానిగా ప్రకటించడమే.

Tags:    

Similar News