టోటల్ గా ఎర్త్ పెట్టేశారట

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంప్ జిలానీలు కూడా ఎక్కువే అయిపోయారు. వారికి డిమాండ్ అధికంగానే ఉంది. అధికార పార్టీలోకి వచ్చేందుకు ఎవరైనా ఇష్టపడతారు. అయితే ఊరికే [more]

Update: 2020-02-17 15:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంప్ జిలానీలు కూడా ఎక్కువే అయిపోయారు. వారికి డిమాండ్ అధికంగానే ఉంది. అధికార పార్టీలోకి వచ్చేందుకు ఎవరైనా ఇష్టపడతారు. అయితే ఊరికే వస్తే ఎలా? ఏదో ఒక ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా కోరుతుండటంతో వైసీపీ నేతలు అదే స్థాయిలో హామీ కూడా ఇస్తున్నారు. దీంతో టీడీపీ ఆ నియోజకవర్గంలో దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. ఉన్న నేతలు జారిపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజుకో నేత వెళ్లిపోతుండటంతో పసుపు పార్టీలో ఆందోళన మొదలయింది.

బీద చేరికతో…..

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే గత రెండు దఫాల నుంచి ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతోంది. ఎమ్మెల్యేగా రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ ఇటీవల ఈ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను టీడీపీని దెబ్బతీశాయి. నియోజకవర్గంలో పట్టున్న బీద సోదరుల్లో ఒకరైన బీద మస్తాన్ రావు టీడీపీిని వీడి వైసీపీలో చేరడంతో మండల స్థాయి నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళుతున్నారు.

వలసలతో ఊపు….

ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అమరా యాదగిరిగుప్తా, మాజీ జడ్పీటీసీ నాయుడు రాంప్రసాద్ లు వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఏఎంసీ ఛైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పదిహేను మంది మాజీ కౌన్సిలర్లు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కావలి నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బీద మస్తాన్ రావులు కలసి మండల నేతలను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

టీడీపీలో కలవరం….

దీంతో టీడీపీలో కలవరం మొదలయింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి పెద్దగా నేతలతో పరిచయం లేకపోవడంతో వారంతా వైసీపీలోకి బీద వెంట వెళుతున్నారు. దీంతో కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి టీడీపీ నేతలతో సమావేశం పెట్టి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. వైసీపీతో టచ్ లో ఉన్న వారిపై కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారట. అయినా వలసలు ఆగకపోవడతో కావలి టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి టీడీపీని దెబ్బతీయాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News