నాడు చ‌క్రం తిప్పినోళ్లకు నేడు దారుల్లేవే.. ?

సీమ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించే జిల్లా ఏదైనా ఉంటే.. అది ఖ‌చ్చితంగా క‌డ‌పే అంటారు ప‌రిశీల‌కులు. తండ్రీ కొడుకులు.. ముఖ్యమంత్రులుగా ఎన్నికైన జిల్లాగా కూడా క‌డ‌ప [more]

Update: 2020-12-13 02:00 GMT

సీమ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించే జిల్లా ఏదైనా ఉంటే.. అది ఖ‌చ్చితంగా క‌డ‌పే అంటారు ప‌రిశీల‌కులు. తండ్రీ కొడుకులు.. ముఖ్యమంత్రులుగా ఎన్నికైన జిల్లాగా కూడా క‌డ‌ప రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఎంతో మంది రాజ‌కీయ యోధుల‌కు, విజ్ఞుల‌కు కూడా ఈ జిల్లా కేంద్రంగా మారింది. అదే స‌మ‌యంలో అనేక మంది నాయ‌కులు .. ఇక్కడ నుంచి గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. కీల‌కంగా చ‌క్రం తిప్పారు. ఇలాంటి వారిలో డీఎల్ ర‌వీంద్రారెడ్డి, మైసూరారెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేత‌లే ఉన్నారు. వీరిలో ఆది నారాయ‌ణ‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో, రామ సుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. మిగిలిన ఇద్దరూ కూడా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

వైఎస్ తోనే ఢీకొని….

ఒక్క వీరే కాకుండా.. అనేక మంది పాత‌త‌రం నాయ‌కులు ఉన్నారు. కానీ, ఎక్కడా వీరి ఊసు వినిపించ‌డం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితోనే డీ అంటే ఢీ అంటూ.. అదే కాంగ్రెస్‌లో మ‌రో గ్రూపులు ఏర్పాటు చేసుకుని చ‌క్రం తిప్పారు. మంత్రి ప‌ద‌వుల‌ను సైతం తెచ్చుకున్నారు. ఇలాంటి వారిలో డీఎల్ ర‌వీంద్రారెడ్డి, మైసూరా రెడ్డి వంటి వారు కీల‌కంగా ఉన్నారు. అయితే.. మైసూరా.. 2014 కు ముందు వైసీపీలో ఉన్నారు. ఆయ‌న పార్టీలో స‌ల‌హాదారుగా కూడా వ్యవ‌హ‌రించారు. జ‌గ‌న్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య త‌లెత్తిన విభేదాల కార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, అప్పటి నుంచి మైసూరా అడ్రస్ రాజ‌కీయాల్లో గ‌ల్లంతైంది.

జగన్ పార్టీలో చేరినా….

ఇక‌, డీఎల్ ర‌వీంద్రారెడ్డి మాజీ మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఈయ‌న రాష్ట్ర విభ‌‌జ‌న స‌య‌మంలోనూ మంత్రిగా ఉన్నారు. త‌ర్వాత మారిన ప‌రిణామాల‌తో కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. ఎప్పుడు అవ‌కాశం వచ్చినా వైసీపీలో చేరేందుకు తాను రెడీనేన‌ని కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ప్రక‌టించారు. కానీ, ఎక్కడో ఈక్వేష‌న్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ పార్టీకి దూరంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ఏ పార్టీలోనూ చేర‌లేదు. దీంతో ఈయ‌న హ‌వా కూడా దాదాపు అంత‌రించింది.

నాడు చక్రం తిప్పి……..

ఇక టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో జిల్లాలో చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి.. ప‌రిస్థితి దారుణంగా ఉంది. క‌డ‌ప‌లో కీల‌క నాయ‌కుడుగా ఎదిగిన ఆయ‌న ఇప్పుడు రాజ‌కీయంగా అల్లాడిపోతున్నారు. బీజేపీలో ఉన్నా.. ఆయ‌న‌ను ప‌ట్టించుకునేవారు.. ప‌ల‌క‌రించేవారు క‌రువ‌య్యారు. దాదాపు ఈయ‌న ప‌రిస్థితి కూడా అంతేన‌ని అంటున్నారు. మొత్తానికి ఇలా.. అనేక మంది సీనియ‌ర్లు.. రాజ‌కీయాల‌కు క‌డుదూరంగా ఉండ‌డం రాజ‌కీయంగా అంత‌రించిపోవ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం జిల్లాలో వైసీపీ త‌ప్ప మ‌రో పార్టీ గురించి ప్రస్తావ‌నే లేదు.

Tags:    

Similar News