తూర్పు వైసీపీలో నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ‌.. ఏరేంజ్‌లో ఉందంటే?

రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, రాజ‌కీయంగా కీల‌క‌మైన జిల్లా తూర్పుగోదావ‌రిలో వైసీపీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు నానాటికీ పెరుగుతోంది. నిజానికి ఈ జిల్లాలో టీడీపీ ఆధిప‌త్యం ఎక్కువ‌. [more]

Update: 2020-07-14 03:30 GMT

రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, రాజ‌కీయంగా కీల‌క‌మైన జిల్లా తూర్పుగోదావ‌రిలో వైసీపీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ పోరు నానాటికీ పెరుగుతోంది. నిజానికి ఈ జిల్లాలో టీడీపీ ఆధిప‌త్యం ఎక్కువ‌. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ అనేక క‌ష్టన‌ష్టాల‌కు ఓర్చుకుని ఈ జిల్లాలో వైసీపీని ప‌రుగులు పెట్టించారు. గుండు గుత్తుగా మెజారిటీ స్థానాల‌ను కైవసం చేసుకున్నారు. ఏకంగా 14 అసెంబ్లీ సీట్ల‌తో పాటు మూడు ఎంపీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అయితే, ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన వైసీపీ నాయ‌కులు.. పార్టీని మ‌రింత‌గా డెవ‌ల‌ప్ చేయాల్సిన నాయ‌క‌లు వారిలో వారు త‌న్నుకుంటున్నా రు. ఆధిప‌త్యం కోసం ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో తూర్పు వైసీపీ రాజ‌కీయాలు రోజు రోజుకు దిగ‌జారుతున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తున్నది.

ఏ పదవి కూడా…..

పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయ్యిందో లేదో అప్పుడే కీల‌క నాయ‌కుల మ‌ధ్య వార్‌తో ఏ ఒక్క ప‌ద‌వి కూడా భ‌ర్తీ కాని ప‌రిస్థితి. ఎవ‌రికి వారు ప‌ద‌వులు అన్ని త‌మ వ‌ర్గానికే ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డంతో పార్టీ అధినేత సైతం తూర్పులో ప‌ద‌వులు భ‌ర్తీ చేయాల‌న్నా.. అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇవ్వాల‌న్నా లైట్ తీస్కోనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. అమ‌లాపురం ఎంపీ చింతా అనురాధ‌కు, అమ‌లాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వరూప్‌కు మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీంతో ఎవ‌రికి వారు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో మంత్రి సొంత పార్టీ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టి జ‌న‌సేన నుంచి గెలుపు గుర్రం ఎక్కిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌రప్రసాద్‌తో చేతులు క‌లుపుతున్నార‌న్న ప్రచారం ఉంది. దీంతో రాజోలు నుంచి ఓడిపోయిన బోంతు రాజేశ్వర‌రావు.. త‌న‌కంటూ.. ప్రత్యేకంగా ఓ కూట‌మిని ఏర్పాటు చేసుకున్నారు. రాజోలులో మాల కార్పొరేష‌న్ చైర్మన్ బొంతు అమ్మాజీ మ‌రో వ‌ర్గంగా ఉన్నారు. బుధ‌వారం వైఎస్సార్ జ‌యంతి రోజునే ఈ వ‌ర్గాల మ‌ధ్య తీవ్రమైన గొడ‌వ‌లు జ‌రిగాయి.

గ్రూపులు బలంగా ఉండటంతో….

ఇక‌, రాజానగ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జ‌క్కం పూడి రాజా.. రాజ‌మండ్రి ఎంపీ.. మార్గాని భ‌ర‌త్‌కు ప‌డ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు సంధించుకుంటున్నారు. ఇసుక మాఫియా అంటూ.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటుండ‌డంతోపాటు.. ప్రతిప‌క్షాన్ని త‌ల‌పించే రేంజ్‌లో ఆవ భూముల‌పై ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఎంపీ భ‌ర‌త్‌పై రాజా సీఎం జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేశార‌న్న ప్రచారం ఉంది. ఇక‌, రామ‌చంద్రాపురంలో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన‌ చెల్లుబోయిన వేణుగోపాల కృష్టకు.. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయి త‌ర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న తోట త్రిమూర్తులుకు కూడా ప‌డ‌డం లేదు. ప్రస్తుతం అమ‌లాపురం పార్లమెంట‌రీ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న త్రిమూర్తులు అంతా తానే అయిన‌ట్టుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇక్కడ త్రిమూర్తుల‌కు రెండున్నర ద‌శాబ్దాల అనుభ‌వం ఉండ‌డంతో ఆయ‌న గ్రూప్ బ‌లంగా ఉంది. దీంతో వీరిద్దరి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భగ్గుమ‌నేలా ఉంది.

ఇన్ ఛార్జి పట్టించుకోక పోవడంతో….

ఇక‌, ఇక్కడే మాజీ మంత్రి, ఇటీవ‌లే రాజ్యస‌భ‌కు ప్రమోట్ అయిన‌.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఓ వ‌ర్గం ఉంది. అంటే .. ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే మూడు గ్రూపులు ఉన్నాయ‌న్నమాట‌. ఇదిలావుంటే.. అన్నవ‌రం దేవ‌స్థానం చైర్మన్ కోసం ప్రత్తిపాడు ఎమ్మెల్యే ప‌ర్వత‌ పూర్ణ చంద్రప్రసాద్‌కు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రా జాల‌కు మ‌ధ్య తీవ్ర ఘ‌ర్షణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ ప‌ద‌వి మా మ‌నిషికి కావాలంటే.. మా మ‌నిషికి కావాలంటూ వీరిద్దరూ బ‌హిరంగంగానే విమ‌ర్శలు గుప్పించుకుంటున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. వీటిని స‌రిచేయాల్సి న జిల్లా ఇంచార్జ్‌.. నాయ‌కుడు టీటీడీ చైర్మన్‌.. వైవీ సుబ్బారెడ్డి.. త‌న ప‌నుల్లో తాను ఉంటూ.. ఇక్కడి గ్రూపు రాజ‌కీయాల‌ను అస్సలు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీంతో మొత్తంగా జిల్లా వైసీపీ రాజ‌కీయాలు గాడిత‌ప్పుతున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. సీఎం జ‌గ‌న్ తాత్సారం చేస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిప‌స్తున్నాయి.

Tags:    

Similar News