పంచాయ‌తీలు స‌రే.. కార్పొరేష‌న్ల మాటేంటి ?

ప్రస్తుతం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తొలిద‌శ నామినేష‌న్ల ప‌ర్వం కూడా సాగుతోంది. ఆది నుంచి ఎన్నిక‌ల‌ను వ్యతిరేకించిన వైసీపీ సుప్రీం తీర్పుతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. అయితే [more]

Update: 2021-02-11 02:00 GMT

ప్రస్తుతం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తొలిద‌శ నామినేష‌న్ల ప‌ర్వం కూడా సాగుతోంది. ఆది నుంచి ఎన్నిక‌ల‌ను వ్యతిరేకించిన వైసీపీ సుప్రీం తీర్పుతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుతున్నాయి. మార్చి తొలి వారంలో కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌కు కూడా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాజ‌కీయంగా వైసీపీలో అంత‌ర్మథ‌నం ప్రారంభ‌మైంది. ప్రధాని రెండు కీల‌క విష‌యాల‌పై వైసీపీ నాయ‌కులు దృష్టి పెట్టారు. ఈ ప‌రిస్థితిలో ఈ రెండు విష‌యాల్లో ఏదైనా జ‌రిగితే.. ప‌రిస్థితి ఏంటి ? అనేది ముఖ్యంగా మ‌ద‌‌న ప‌డుతున్న అంశం.

విష‌యం.. 1:

గ్రామ పంచాయ‌తీల్లో గెలుపుపై ధీమా ఉంది. ఎందుకంటే.. రైతుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు ఏదో చేస్తోంద‌నే ఆలోచ‌న గ్రామీణ స్థాయిలో ఉంది. అదేవిధంగా అమ్మ ఒడి (ఎక్కువ‌గా ప్రభుత్వ స్కూళ్లు గ్రామాల్లోనే ఉన్నాయి) బాగానే అమ‌లైంది. ఇక‌, పేద‌ల‌కు ఇళ్ల విష‌యంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో సంతృప్తి బాగానే ఉంది. మ‌రో ముఖ్యమైన విష‌యం రాజ‌ధాని మార్పు విష‌యంలో జ‌గ‌న్‌కు ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల నుంచి మ‌ద్దతు ల‌భిస్తోంది. ఇక‌, ప‌థ‌కాల అమ‌లు తీరు, డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు, రైతు భ‌రోసా కేంద్రాల ఏర్పాటు వంటివి వైసీపీకి బాగానే క‌లిసివ‌స్తున్నాయి. ఈ విష‌యంలో వైసీపీ నాయ‌కులు హ్యాపీనే. ఇక గ్రామ స‌చివాల‌యాల‌తో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజ‌లు బాగా ల‌బ్ధి పొందుతున్నారు. వారికి ప‌రిపాల‌న ద‌గ్గర‌కు రావ‌డంతో పాటు స‌మయం క‌లిసొస్తోంది. ఇక వలంటీర్ల వ్యవ‌స్థతో కూడా గ్రామీణుల‌కు ల‌బ్ధి జ‌ర‌గ‌డం ఒక ప్లస్ అయితే.. ఎక్కువ మందికి ఏదో ఒక రూపంలో ఉపాధి దొరికింది. ఇవ‌న్నీ గ్రామాల్లో వైసీపీని ప‌టిష్టం చేశాయి.

విష‌యం.. 2 :

అయితే.. గ్రామీణ వాతావ‌ర‌ణానికి కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో ఉండే ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య చాలా వ్యత్యాసం ఉంది. దైనందిన వార్తల‌ను ఫాలో అయ్యేవారు. ప్రభుత్వ పాల‌న‌ను నిశితంగా గ‌మ‌నించేవారు.. మేధావులు, విశ్లేష‌కులు, ఉద్యోగులు, చ‌దువరులు, విద్యార్థులు వంటి అనే కోణంలో చూసుకుంటే.. న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ప్రభుత్వంపై ఒక విధ‌మైన పాజిటివ్ థింకింగ్ లేద‌నే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమ‌వుతోంది. అదేవిధంగా అమ్మ ఒడి ఈ ఏడాది దాదాపు మూడు ల‌క్షల మందికి అంద‌లేదు. ఇదంతా న‌గ‌రాలు, ప‌ట్టణాల్లోనే క‌నిపిస్తోంది. ఇక‌, రాజ‌కీయ కూర్పులు, మార్పులు.. జ‌రిగింది కూడా ఇక్కడే దీంతో పంచాయ‌తీల్లో ఉన్న ప్రభావం.. కార్పొరేష‌న్లపైనా, న‌గ‌రాల‌పైనా చూపించ‌ద‌ని అంటున్నారు. మ‌రి దీనికి విరుగుడుగా ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.

Tags:    

Similar News