Ysrcp : వైసీపీకి ఇక్కడ ఊరట అప్పుడేనా?

బద్వేలు ఉప ఎన్నిక నేడు జరగనుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులున్నా ప్రచారంలో ముందంజలో ఉంది మూడు [more]

Update: 2021-10-30 02:00 GMT

బద్వేలు ఉప ఎన్నిక నేడు జరగనుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులున్నా ప్రచారంలో ముందంజలో ఉంది మూడు పార్టీలే. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బద్వేలు బరిలో ఉన్నారు. అయితే ఇప్పటికే వైసీపీ విజయం ఖాయమైంది. అయితే మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉంది. ఈరోజు జరిగే పోలింగ్ కు భారీగా ఓటర్లు చేరుకునేలా అధికార పార్టీ ప్లాన్ చేసింది.

ఏకగ్రీవం కావాలని….

సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలు ఉప ఎన్నిక నేడు జరగనుంది. అధికార వైసీపీ వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను అభ్యర్థిగా నిర్ణయించింది. అయితే అనూహ్యంగా టీడీపీ, జనసేన ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పడంతో ఎన్నిక దాదాపు ఏకపక్షమే అయింది. ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికను జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తామని చెప్పడంతో ఈరోజు పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వైసీపీ గెలుపు….

వైసీపీ అధికారంలో ఉండటం, ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావడంతో మెజారిటీపైనే వైసీపీ తొలి నుంచి దృష్టి పెట్టింది. పోటీ పెద్దగా లేదని భావించి వైసీపీ అశ్రద్ధ చేయలేదు. బద్వేలు ఉప ఎన్నిక కోసం జగన్ నియమించిన ఇన్ చార్జులు ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక తరహాలోనే ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు ప్రతి ఇంటి గడప తట్టి పలకరించారు. ప్రచారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జగన్ ఆదేశించడంతో వైసీపీ నేతలు బద్వేలును వీడలేదు.

రెండు పార్టీలు…

ఇక బీజేపీ, కాంగ్రెస్ లు కూడా శక్తివంచన లేకుండానే పోరాడాయి. అయితే ఈ రెండింటిలో రెండోస్థానం ఎవరికి అన్న చర్చ జరుగుతోంది. బీజేపీకి జనసేన బహిరంగంగా మద్దతు ప్రకటించింది. టీడీపీ మాత్రం ఎవరికి మద్దతు ప్రకటించలేదు. దీంతో టీడీపీ ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంా ప్రచారాన్ని నిర్వహించాయి. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందన్న దానిపైనే వైసీపీ మెజారిటీ ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News