Badvel : బద్వేలులో స్ట్రాటజీ మార్చిన వైసీపీ.. అందుకేనా?

బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడింది. ఇక్కడ వైసీపీ విజయం నామమాత్రమే. ప్రచారంలోనే ఈ విషయం వెల్లడయింది. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ [more]

Update: 2021-10-26 11:00 GMT

బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడింది. ఇక్కడ వైసీపీ విజయం నామమాత్రమే. ప్రచారంలోనే ఈ విషయం వెల్లడయింది. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధకు మంచి ఆదరణ లభిస్తుంది. ఎక్కడకు వెళ్లినా తమ కుటుంబ సభ్యురాలిని ఆహ్వానించినట్లు ప్రజలు ఉండటంతో ఆ పార్టీ మెజారిటీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రమే ఇక్కడ పోటీ చేస్తున్నాయని వైసీపీ నేతలు దీనిని విడిచి పెట్టడం లేదు.

పోటీ నామమాత్రమే అవ్వడంతో….

మంత్రులు కూడా ఇక్కడ పర్యటిస్తూ మెజారిటీ అత్యధికంగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటింగ్ శాతం పెంచాలని భావించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఇక్కడ పోటీ చేయడం లేదు. టీడీపీ ఇక్కడ ఎవరికీ మద్దతివ్వడం లేదు. బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించక పోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకుపై వైసీపీ కన్నేసింది. వారిని గుర్తించి ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించింది.

పోలింగ్ కేంద్రాలకు….

అందుకే ప్రతి ఓటును పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకసారి ఓటరు టర్న్ అయితే అది భవిష్యత్ లో టీడీపీకి నష్టమని భావించిన వైసీపీ బద్వేలులో ఈ ప్రయోగానికి సిద్ధమయింది. టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యక్తిగతంగా వారిని కలిసి వైసీీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించే ప్రయత్నం చేస్తుంది. స్థానిక నేతలను పక్కన పెట్టి బద్వేలు అభివృద్ధికి పాటుపడాలని వారిని కోరనుంది.

ఓట్ల శాతాన్ని కూడా….

ఈ కారణంగా ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పోలింగ్ శాతం పెరిగితే వైసీపీ మెజారిటీ కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారు. అందుకే ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ ఛార్జులందరూ పోలింగ్ శాతం పెంచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జనసేన, టీడీపీ ఓటు బ్యాంకును కూడగట్టే పనిలో ఉన్నాయి. స్థానిక నేతలను కలసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బద్వేలులో పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగితే అంత మెజారిటీ వైసీపీకి దక్కుతందని చెబుతున్నారు.

 

 

Tags:    

Similar News